Ads
తాజాగా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్‌కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
Video Advertisement
ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దినసరి కూలీల నుంచి ఎందరో పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే ఉందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదం జరిగిన కోరమాండల్ ట్రైన్ లో ఎక్కబోయి చివరినిమిషాల్లో ప్రయాణం మానుకున్నారు లక్ష్మీ దాస్ సర్కార్. హౌరాలో నివసిస్తున్న లక్ష్మీ దాస్ జూన్ 2న వురమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి తన కుమార్తెను కలవడానికి ఆమె చెన్నైకి వెళ్ళాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన కుమార్తె యొక్క ఆఫీస్ కమిట్మెంట్ కారణంగా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. అదే ఆమెకు వరంగా మారింది.
ఆమె జూన్ 2 ప్రమాదం తర్వాత మొదటి రన్లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కింది. అప్పుడు ఆమె ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. “దేవుడి దయవల్ల ఆ రోజు నా ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. నా కుమార్తె రావద్దు అనడంతో నేను ఆగిపోయాను. ఇదంతా కృష్ణుడి దయవల్ల జరిగింది. ఇప్పుడు కూడా నేను నాతో కృష్ణుడిని తీసుకువెళ్తున్నాను. ఇక నాకు ఏ ప్రమాదం ఉండదు..” అని ఆమె అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. “”పాయింట్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో లోపాల కారణంగా ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సమయంలో జరిగిన మార్పులు ప్రమాదానికి కారణమయ్యాయి. ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? అన్నది దర్యాప్తులో తెలుస్తుంది” అని పేర్కొన్నారు రైల్వేశాఖ మంత్రి.
Also read: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో నష్టపోయిన ఈ వ్యక్తి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
End of Article