ఒకప్పటి ఈ 16 మంది “చైల్డ్ ఆర్టిస్ట్స్” ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఏం చేస్తున్నారంటే?

ఒకప్పటి ఈ 16 మంది “చైల్డ్ ఆర్టిస్ట్స్” ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఏం చేస్తున్నారంటే?

by Mohana Priya

Ads

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

Video Advertisement

వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు. అలా చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడు మళ్లీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వాళ్ళలో కొంతమందిని ఇప్పుడు చూద్దాం.

#1 తేజ సజ్జ – ఇంద్ర

చిన్నప్పుడు ఇంద్ర, రాజకుమారుడు, యువరాజు, చూడాలని ఉంది, బాచి, సాంబ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఓ బేబీ లో లక్ష్మి/సమంత మనవడిగా నటించాడు.ప్రస్తుతం శివాని రాజశేఖర్ మొదటి సినిమాలో తన పక్కన హీరోగా నటిస్తున్నాడు.

#2 సుహాని కలిటా – మనసంతా నువ్వే

మనసంతా నువ్వే, ఎలా చెప్పను చిత్రాల్లో బాలనటిగా నటించింది. తర్వాత సవాల్, కృషి, శ్రీశైలం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

#3 సనూష – బంగారం

బంగారం తో పాటు ఎన్నో తమిళ సినిమాల్లో బాలనటిగా నటించింది. ఇటీవల విడుదలైన జెర్సీ సినిమా లో రమ్య పాత్ర పోషించింది.

#4 ఆనంద్ వర్ధన్ – సూర్యవంశం

చిన్నప్పుడు సూర్యవంశం, ప్రియరాగాలు వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

#5 అన్నీ – రాజన్న

రాజన్న, స్వాగతం, సినిమాల్లో నటించింది. మధ్యలో కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రంగస్థలం లో రామ్ చరణ్ కి చెల్లి గా నటించింది.

#6 గ్రీష్మ నేత్రిక – మల్లీశ్వరి 

మల్లీశ్వరి, అమ్ములు సినిమాల్లో బాలనటిగా నటించింది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లో ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో బసవతారకం యంగ్ గా ఉన్నప్పటి పాత్ర పోషించింది. ఇటీవల వచ్చిన భీష్మ సినిమాలో ఒక పాటలో కనిపిస్తుంది.

#7 గౌరవ్ – డార్లింగ్

డార్లింగ్, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు స్పైడర్ లో మహేష్ బాబు కి తమ్ముడిగా నటించాడు.

#8 మనోజ్ నందం – అతడు

అతడు, చత్రపతి, మున్నా సినిమాల్లో హీరోల చిన్నప్పటి పాత్ర పోషించాడు. తర్వాత హీరోగా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ధనలక్ష్మి తలుపు తడితే సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జార్జ్ రెడ్డి లో ఒక ముఖ్య పాత్ర లో కనిపించాడు.

#9 బాలాదిత్య – హలో బ్రదర్

హలో బ్రదర్ సినిమా లో నాగార్జున చిన్నప్పటి పాత్రలో నటించాడు. తర్వాత హీరోగా చంటిగాడు సినిమాలో నటించాడు. కొన్ని పాటలు కూడా రాశాడు. ప్రస్తుతం జెమిని లో వచ్చే ఒక సీరియల్ తో పాటు తమిళ్ సీరియల్ లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

#10 సంతోష్ శోభన్ – గోల్కొండ హై స్కూల్

బాబి, వర్షం, ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శోభన్ కొడుకు సంతోష్. గోల్కొండ హై స్కూల్ లో కెప్టెన్ గౌతమ్ గా నటించాడు సంతోష్. 2008లో శోభన్ గుండెపోటుతో మరణించారు. సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమాలో హీరోగా నటించాడు.

#11 పవన్ శ్రీరామ్ – హరే రామ్, శ్రీరామరాజ్యం

శ్రీరామరాజ్యం, హరే రామ్ లాంటి ఎన్నో సినిమాల్లో బాల నటుడి గా కనిపించాడు. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

#12 శ్రీదివ్య – యువరాజు

యువరాజు లో బాలనటిగా కనిపించింది. తర్వాత తూర్పు వెళ్ళే రైలు సీరియల్ లో నటించింది. ఆ తర్వాత మనసారా, కేరింత, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, వారధి సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుంది.

#13 దివ్య నగేష్ – అరుంధతి

అరుంధతి సినిమాలో చిన్న అనుష్క గా నటించింది. ఆ సినిమా కి నంది అవార్డు కూడా అందుకుంది. నేను నాన్న ఓ అబద్ధం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

#14 ఆకాష్ పూరి – బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్, బుజ్జి గాడు సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రలో నటించాడు. హీరోగా ఆంధ్ర పోరి, మెహబూబా సినిమాలు చేశాడు. తన తండ్రి పూరిజగన్నాథ్ నిర్మాణంలో ఆకాష్ నటించిన రొమాన్స్ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

#15 తరుణ్ – ఆదిత్య 369

తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిత్య 369 లో బాలనటుడిగా కనిపించాడు. హీరోగా నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ఎలా చెప్పను, నిన్నే ఇష్టపడ్డాను, అదృష్టం, సోగ్గాడు, నువ్వు లేక నేను లేను ఇంకా ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు

#16 సునయన – అమ్మోరు

అమ్మోరు సినిమా లో అమ్మోరు పాత్రలో నటించింది. గత సంవత్సరం వచ్చిన ఓ బేబీ లో రాజేంద్ర ప్రసాద్ కూతురు గా కనిపించింది. అంతేకాకుండా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ పేరుతో యూట్యూబ్ సిరీస్ కూడా చేస్తోంది.


End of Article

You may also like