Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయాణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 600కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
Video Advertisement
ప్రభాస్ రాముడిగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సీతాదేవిగా నటించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) రూపొందించిన ఆదిపురుష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్ విడుదల కోసం అభిమనులతో పాటుగా దేశవ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినపుడే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పోస్టర్, టీజర్ రిలీజ్ అయ్యాక, తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దాంతో మేకర్స్ గ్రాఫిక్స్ విషయంలో మరింత వర్క్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.
పోస్టర్ రీలజ్ తో మొదలయిన వివాదాలు ఇప్పటి వరకు కొనగుతూనే ఉన్నాయి. కొందరు రాముడికి మీసాలు పెట్టడం పై విమర్శిస్తే, కొందరు రావణుడు లుక్ పై విమర్శించారు. ఇటీవల ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక, రాముడికి ఆనవాలు కోసం హనుమాన్ కి సీతాదేవి చూడామణికి బదులుగా గాజులు ఇవ్వడం, రావణుడు సీతను ఎత్తుకెళ్ళే విధానం పై ఇలా చాలా విషయాలు వివాదస్పదంగా మారాయి. వీటన్నిటి మధ్య జూన్ 16న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే ఈమధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఫోటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏఐ రూపొందించిన ఆదిపురుష్ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసినవారు మూవీ కన్నా ఇవే బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు చూడండి.
1.
2.
3.
4.5.
6.
7.
8.
9.
Also Read: “ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)” ద్వారా సృష్టించిన… 13 హీరోల ఫోటోలు..!
End of Article