SSMB 29 స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..? ఈ సారి రాజమౌళి ఇలా ప్లాన్ చేశారా..?

SSMB 29 స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..? ఈ సారి రాజమౌళి ఇలా ప్లాన్ చేశారా..?

by Mohana Priya

Ads

తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అయితే రాజమౌళి ఒక సినిమాకి కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే.

Video Advertisement

ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ వాళ్ళతో కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా పూర్తి అయ్యాక మహేష్ బాబు వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వకుండా రాజమౌళి సినిమా కోసం సమయం కేటాయిస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. అదేంటంటే, ఈ సినిమాని అధికారికంగా ఆగస్ట్ 9, అంటే మహేష్ బాబు పుట్టినరోజు నాడు ప్రకటిస్తారట. ఇప్పుడు రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 లో మొదలవుతుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి కూడా కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. అదేంటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర హనుమాన్ ని పోలి ఉంటుందట. ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రూపొందుతోంది. సినిమాలో ఎక్కువ భాగం ఫారెస్ట్ లో చిత్రీకరిస్తారు. ఈ సినిమా హీరోయిన్ దీపికా పదుకొనే అనే వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారు అనే వార్త కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఒక కొత్త కాంబినేషన్ అవుతుంది. అంతే కాకుండా కొంత మంది ఈ సినిమా భాగాల్లో రూపొందుతుంది అని కూడా అంటున్నారు. ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఈ వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి.


End of Article

You may also like