సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది..!..! ఈ సినిమా గురించి తెలుసా..?

సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది..!..! ఈ సినిమా గురించి తెలుసా..?

by kavitha

Ads

తమిళ నటుడు శరత్‌కుమార్ సినిమా సినిమాకు విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటిస్తూ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ పలు చిత్రాలలో నటిస్తున్నారు. ఈ విలక్షణ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘పోర్ థోజిల్’. ఈ చిత్రం జూన్ 9న తమిళంలో విడుదల అయ్యింది.

Video Advertisement

‘పోర్ థోజిల్’ అనే చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండే  పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ‘పోర్ థోజిల్ కోలీవుడ్ లో సంచలనంగా మారింది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం..
por-thozhil-movie-1ఒకప్పడు హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన శరత్‌కుమార్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వారసుడు, పీఎస్ 2 సినిమాల ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. శరత్‌ కుమార్ డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పత్రలో నటించిన తమిళ చిత్రం ‘పోర్ థోజిల్’ విడుదల అయ్యింది.  ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ తెచ్చుకున్న ఈ మూవీ, కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే తిరుచ్చి అనే ఊరులో ఒక సైకో అమ్మయిలను వరుసగా చంపేస్తుంటాడు. ఆ సైకో ఎవరు? అతను అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన ప్రకాష్ (అశోక్ సెల్వన్) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియెన్స్ ని స్టోరీతో పాటు ప్రయాణించేలా చేస్తుంది.కొత్త దర్శకుడు అయినప్పటికీ విఘ్నేష్ రాజా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీసు డిపార్ట్మెంట్ లో చేరిన వ్యక్తిగా అశోక్ సెల్వన్, సీనియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉండే ఇగో, సీన్స్ చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

Also Read: “సందీప్ రెడ్డి వంగా” కూడా కాపీ కొట్టారా..? ఎక్కడి నుండి అంటే..?


End of Article

You may also like