Ads
వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ పరశురాం పెట్ల కాంబినేషన్ లో గీత గోవిందం సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లోనే మరొక సినిమా వస్తోంది. ఈ సినిమా రేపు ప్రారంభం అవుతుంది అని సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది తెలిసిపోయింది.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఇప్పటికే మృణాల్ నాని హీరోగా వస్తున్న సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ అని అన్నారు. ఈ వార్త చాలా ప్రచారం అయ్యింది.
ఇప్పుడు మృణాల్ హీరోయిన్ అని అంటున్నారు. ఒక సందర్భంలో మృణాల్ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కనే నటిస్తూ ఉడడంతో చాలా మంది తన అభిమాన నటుడితోనే మృణాల్ నటిస్తోంది అని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమా కూడా ఇటీవల ప్రారంభం అయ్యింది.
పరుశురాం పెట్ల గత సంవత్సరం మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ వార్త మాత్రం ప్రచారంలో ఉంది.
End of Article