టాలీవుడ్ లో “ప్రభాస్” సెన్సేషనల్ రికార్డు.. అక్షరాలా 468 కోట్లు..!

టాలీవుడ్ లో “ప్రభాస్” సెన్సేషనల్ రికార్డు.. అక్షరాలా 468 కోట్లు..!

by kavitha

Ads

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనదైన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌ అయ్యారు. ఆసినిమాల తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటించిన ‘ఆదిపురుష్’మూవీతో జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

Video Advertisement

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందింది. టీజర్ తో ఈ సినిమా పై విమర్శలు వచ్చినప్పటికీ,ట్రైలర్ రిలీజ్ తో ఈ చిత్రం పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రంకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సంచలన రికార్డు సృష్టించాడు. ఆ రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
prabhas-1ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఏపీ, తెలంగాణలో అన్ని ఏరియాల హక్కుల కోసం భారీగా పోటీ ఏర్పడింది. దీని ఫలితంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ప్రభాస్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలలో 3వ స్థానానికి చేరింది. ఈ చిత్రం కంటే ముందు బాహుబలి 2 సినిమా 122 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఆదిపురుష్ మాత్రమేకాకుండా ప్రభాస్ గత 4 సినిమాలకు కూడా ఏపీ, తెలంగాణలో వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. బాహుబలి 2 సినిమాకి రూ.122 కోట్లు, సాహో సినిమాకి రూ.121.60 కోట్లు, రాధే శ్యామ్ సినిమాకు రూ.105.20 కోట్లు, ఆదిపురుష్ సినిమాకి రూ.120 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ విధంగా ప్రభాస్ గత 4 సినిమాలకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలోమొత్తం రూ. 468.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా బిజినెస్ చేసిన ఒకే ఒక హీరోగా ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు.

Also Read: “ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా..?” అంటూ… “ప్రభాస్” ఫ్యాన్స్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like