“బుద్ధి ఉందా..? ఇలా చేశారేంటి..?” అంటూ… ప్రభాస్ “ఫ్యాన్స్” పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..! ఏం జరిగిందంటే..?

“బుద్ధి ఉందా..? ఇలా చేశారేంటి..?” అంటూ… ప్రభాస్ “ఫ్యాన్స్” పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

తమ అభిమాన హీరోల అంటే ఫ్యాన్స్ కు ప్రాణం. వారి పై ఎంతో ప్రేమను చూపిస్తారు. హీరోల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కోసారి అభిమానుల ప్రేమ హద్దులు కూడా దాటుతుంది. తమ ఫేవరెట్ హీరో పై ఉన్న అభిమానంతో చేసే పనుల వల్ల ఇతరులకు జరిగే నష్టం గురించి ఆలోచించరు.

Video Advertisement

తమ ఫేవరెట్ హీరోలను ఏమైనా అంటే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. హీరోలనే కాకుండా వారికి సంబంధించిన వాటిని కూడా ఫ్యాన్స్ పర్సనల్ గా తీసుకుంటారు. తాజాగా ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడిన ఒక వ్యక్తితో ప్రభాస్ అభిమానులు ప్రవర్తించిన విధానం అందరిని కలవర పెట్టింది. ఈ వీడియో ప్రసత్తటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్​, రావణుడుగా సైఫ్​అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లో ఐమాక్స్ మల్టీ ప్లెక్స్ థియేటర్ లో ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రదర్శించారు.సినిమా చూసిన ప్రేక్షకులను మీడియా మూవీ ఎలా ఉందని రివ్యూ చేస్తుంది. ఆ క్రమంలోనే ఒక వ్యక్తిని ఆదిపురుష్ ఎలా ఉందని మీడియా అడుగగా, అతను బాలేదని చెప్పాడు. ప్రభాస్ అన్న నటన గురించి మాట్లాడట్లేదు. ఆచార్యలో చిరంజీవిని ఎలా చూపించారో, అలాగే ఆదిపురుష్ లో త్రీడీ ప్రభాస్ ను చూపించారని అన్నారు. ప్లే స్టేషన్ లో ఉండే రాక్షసులను ఈ మూవీలో  చూపించారు. హనుమాన్, బీజీఎమ్, కొన్ని త్రీడీ షాట్స్ తప్పా సినిమాలో ఏం లేదని అన్నాడు. ప్రభాస్ రాముడిగా అస్సలు సెట్ కాలేదు. ప్రభాస్ ను దర్శకుడు సరిగా చూపించలేదని తెలిపాడు.
ఆ వ్యక్తి మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. నువ్వు అసలుఏం చూశావ్, కళ్లు కనిపిస్తాయా అని తిట్టారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా ఫ్యాన్స్ తో వాగ్వాదానికి దిగడంతో అతన్ని ఫ్యాన్స్ చితక బాదారు. అక్కడున్న మీడియా వారిని ఆపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.

watch video :

Also read: “ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంది ఏంటి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like