Ads
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్, గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Video Advertisement
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గుంటూరు కారంని విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ మూవీకి గురూజీ అల వైకుంఠపురములో స్ట్రాటజీని వాడుతున్నారు అని సమాచారం. ఈ సినిమా ముందు మ్యూజికల్ హిట్ అయిన విషయం తెలిసిందే.మూడు నెలల ముందుగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ వచ్చారు. దీంతో అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ కాకుండానే 50 శాతం హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా సినిమా ఆకట్టు కోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
త్రివిక్రమ్ ఇదే స్ట్రాటెజిని గుంటూరు కారం మూవీకి వాడబోతున్నారట. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడంతో మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే గుంటూరు కారం నుండి కూడా రెండు మూడు నెలల ముందుగానే సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారట.ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసారని సమాచారం.
మరోవైపు రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ గ్లింప్స్ కి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. ఈ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు గా నిలిచింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ టైటిల్, మాస్ స్ట్రైక్ గ్లింప్స్ గురించి అంతర్జాతీయంగా పేరుగాంచిన వెరైటీ పత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురితం అయింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also read: ఈ కారణం వల్లే ఆదిపురుష్ టీమ్ ఇంటర్వ్యూ లకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారా..?
End of Article