Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిన ప్రభాస్ 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీని పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
Video Advertisement
ఆ మూవీ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ మూవీతో ఆడియెన్స్ ని పలకరించాడు. ప్రభాస్ నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ప్రభాస్ సినిమాలలో కొన్ని బెస్ట్ ఉండగా, మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. ఐఎండీబీ ప్రకారం ప్రభాస్ బెస్ట్, వరెస్ట్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఐఎండీబీ ప్రకారం ప్రభాస్ బెస్ట్ సినిమాలు:
1. బాహుబలి 2: ది కన్‌క్లూజన్:
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐఎండీబీ ప్రకారం 8.2 రేటింగ్ పొందింది.
2. . బాహుబలి: ది బిగినింగ్:
ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించారు. ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఐఎండీబీ ప్రకారం 8.0 రేటింగ్ పొందింది.3. చత్రపతి:
డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఐఎండీబీ ప్రకారం 7.6 రేటింగ్ పొందింది.4. డార్లింగ్:
2010 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఐఎండీబీ ప్రకారం 7.4 రేటింగ్ పొందింది.
5. మిర్చి:
కొరటాల శివ దర్శకత్వంలో 2013లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, సత్య రాజ్, నదియ నటించారు. ఐఎండీబీ ప్రకారం 7.3 రేటింగ్ పొందింది.
ఐఎండీబీ ప్రకారం ప్రభాస్ వరెస్ట్ సినిమాలు:
1. రెబల్:
లారెన్స్ రఘువేంద్ర దర్శకత్వంలో ప్రభాస్, తమన్నా జంటగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణం రాజు ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్లాప్ గా డిజాస్టర్‌గా నిలిచింది. ఐఎండీబీలో 4.7 రేటింగ్ పొందింది.
2. ఈశ్వర్:
జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈశ్వర్. ఈ సినిమా ప్రభాస్ కి మొదటి సినిమా. శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఐఎండీబీలో 5.2 రేటింగ్ పొందింది.
3. సాహో:
ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఐఎండీబీలో 5.2 రేటింగ్ పొందింది.4. మున్నా:
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2007లో విడుదలైంది. ప్రభాస్ ఇలియానా జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఐఎండీబీ ప్రకారం ఈ చిత్రానికి 5.6 రేటింగ్ పొందింది.
5. పౌర్ణమి:
ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష, ఛార్మి నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.ఐఎండీబీ ప్రకారం 5.8 రేటింగ్‌ను పొందింది.
Also Read: “ప్రభాస్” ఫ్యాన్ అడిగిన ప్రశ్నకి వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ రిప్లై..!
End of Article