ఎన్నాళ్ళకి… మళ్లీ 17 సంవత్సరాల తర్వాత ఆ హీరోయిన్ తో చిరంజీవి..! ఏ సినిమాలో అంటే..?

ఎన్నాళ్ళకి… మళ్లీ 17 సంవత్సరాల తర్వాత ఆ హీరోయిన్ తో చిరంజీవి..! ఏ సినిమాలో అంటే..?

by Mohana Priya

Ads

యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇది అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఇందులో తమన్నా భాటియా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా హీరో సుశాంత్ కీర్తి సురేష్ పక్కన హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక వీడియో కూడా చిరంజీవి ఇటీవల షేర్ చేశారు.

Chiranjeevi to act with this heroine

ఈ సినిమా తర్వాత చిరంజీవి మరొక రీమేక్ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన బ్రో డాడీ సినిమాకి ఇది రీమేక్ అని సమాచారం. ఈ సినిమాకి మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకు పాత్రలో కూడా పృథ్వీరాజ్ నటించారు.

ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నారు. అయితే మలయాళంలో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా మీనా నటించారు. కానీ తెలుగులో ఎవరు నటిస్తారు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి పక్కనే త్రిష హీరోయిన్ గా నటిస్తారు. అంతే కాకుండా పృథ్వీరాజ్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ నటిస్తారు అని, సిద్దు పక్కన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

మలయాళంలో అయితే మోహన్ లాల్ పృథ్వీరాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. అంతే కాకుండా కళ్యాణి ప్రియదర్శన్ పృథ్వీరాజ్ పక్కన హీరోయిన్ గా నటించారు. మరి తెలుగులో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంత వరకు మార్చి అన్నాతమ్ములుగా నటిస్తారు ఏమో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, ఆ అమ్మాయి గర్భవతి అవ్వడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం.

Trisha

అప్పుడే ఆ అబ్బాయి తల్లి కూడా మళ్లీ గర్భవతి అవ్వడం అనే టాపిక్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేసి మలయాళంలో పెద్ద హిట్ కొట్టారు. మరి తెలుగులో ఏం చేస్తారో అనేది చూడాలి. అయితే చిరంజీవి, త్రిష అంతకు ముందు మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమాలో నటించారు అనే సంగతి అందరికీ తెలిసిందే.

remake hit movies of chiranjeevi

ఇప్పుడు మళ్లీ దాదాపు 17 సంవత్సరాల తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్నారు. అసలు ఆచార్య సినిమాలో మొదట హీరోయిన్ పాత్రలో త్రిష నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో చిరంజీవి పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


End of Article

You may also like