అప్పుడు “షారుక్ ఖాన్” నే ట్రోల్ చేశాడు..! ఇప్పుడు తానే ట్రోల్ అవుతున్నాడు..!

అప్పుడు “షారుక్ ఖాన్” నే ట్రోల్ చేశాడు..! ఇప్పుడు తానే ట్రోల్ అవుతున్నాడు..!

by kavitha

Ads

ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఆదిపురుష్’ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం రోజు థియేటర్లలో విడుదలైంది. ఫ్యాన్స్ కి నచ్చినప్పటికీ, ఈ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. ఈ మూవీ పై నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

సోషల్ మీడియాలో ఈ మూవీ దర్శకుడు ఓం రౌత్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓం రౌత్ గతంలో చేసిన ట్విట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓం రౌత్ గతంలో షారుక్ ఖాన్ ఫ్యాన్ మూవీ పై చేసిన ట్వీట్ తాజాగా వైరల్ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
om-rauts-old-tweetప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ పై విమర్శలు వస్తున్నాయి. ఈ  సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌, పాత్రల వస్త్రధారణ పై మరియు పాత్రల చిత్రీకరణ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ పై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఓం రౌత్ పాత ట్వీట్ ఒకటి  వైరల్ గా మారింది. అది కూడా 2016లో చేసిన ట్వీట్. దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చి, ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే  ఓం రౌత్ ఆ ట్వీట్ లో షారుక్‌ ఫ్యాన్ సినిమాతో పొలుస్తూ మరాఠీ సినిమా ‘సైరాట్‌’ పై ప్రశంసలు కురిపించాడు. అయితే షారుక్ ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం రౌత్‌ ‘మరాఠీ సినిమా ‘సైరాట్’ షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.
ఆదిపురుష్ సినిమాతో ట్రోల్ అవుతున్న ఓం రౌత్‌ను షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా షారుక్ ఒక సందర్భంలో కర్మ గురించి చేసిన ట్వీట్ తో ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల ‘ఆదిపురుష్’ సినిమా కన్నా 4 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘సైరాట్‌’ మూవీ వీఎఫ్‌ఎక్స్‌, సినిమాటోగ్రఫీ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాలో “శూర్పణఖ” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?

 


End of Article

You may also like