Ads
అపరిచితుడు సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా మన సినిమా లాగా ఆదరించిన సినిమాల లో అపరిచితుడు కూడా ఒకటి. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక కొత్త రకం వ్యాధి ని ఈ సినిమా ద్వారా జనాల్లోకి తీసుకువచ్చారు శంకర్.
Video Advertisement
ఇంక విక్రమ్ నటన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ పాత్రలో విక్రమ్ ని తప్ప ఇంకెవర్నీ ఊహించుకోలేం. ఇప్పుడు కూడా అపరిచితుడు పేరు వినగానే మనకి గుర్తొచ్చేది విక్రమ్ ముఖమే. ఒకసారి వెనక్కి వెళ్లి సినిమా మొత్తం మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. విక్రమ్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఆ విషయం తనకి తెలీదు. అతని లో ఉండే ముగ్గురు మనుషుల లో ఒకతను అన్యాయం జరిగితే సహించడు. నరకంలో విధించే శిక్షల రూపంలో నేరస్తులు అందరిని చంపుతాడు.
పోలీసులు హత్యలు చేసేది ఎవరు అని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎటువంటి ఆధారం దొరకదు. విక్రమ్ లో ఉన్న ముగ్గురిలో ఒక అతనితో ప్రేమ లో ఉన్న హీరోయిన్ విక్రమ్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం చూసి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ విక్రమ్ హిప్నటైజ్ అవుతాడు.
తనకి ఒక చెల్లి కూడా ఉండేది అని, వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటే వర్షం వల్ల రోడ్డుమీద నిలిచిపోయిన నీటిలో కరెంటు వైర్ పడి విక్రమ్ ఇంకా వాళ్ళ చెల్లి తో పాటు మరికొందరు వస్తున్న వాహనం అదుపు తప్పి ఆ నీళ్లలో పడడంతో వాళ్ళ చెల్లెలు నీటిలో పడి కరెంట్ షాక్ కొట్టి చనిపోతుంది.
అప్పటి నుంచి విక్రమ్ మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటాడు. కరెంట్ దగ్గర పనిచేసిన లైన్ మ్యాన్ ని అరెస్ట్ చేయకుండా కోర్టులో కూడా సరైన తీర్పు ఇవ్వకపోవడంతో విక్రమ్ కి తెలియకుండానే మానసికంగా తనలో ఎంతో మార్పు వస్తుంది. అందులో నుండి వచ్చినదే ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. తర్వాత సైక్రియాటిస్ట్ సహాయంతో విక్రమ్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. కానీ చివరి లో ట్రైన్ లో మందు తాగుతున్న ఒక వ్యక్తిని చంపేస్తాడు.
అసలు ఈ సినిమా కథ అంతా అందరికీ తెలిసిందే కదా? మళ్లీ కొత్తగా చెప్పడం దేనికి? అనుకుంటున్నారా? ఒకసారి క్లైమాక్స్ ని గమనించండి. విక్రమ్ ఆ వ్యక్తిని ఎందుకు చంపుతాడు? మీలో సగంమంది దీనికి ఆన్సర్ తప్పుగా అనుకుంటారు.
ఏముంది? పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో తాగడం తప్పు. అతను తాగాడు అందుకే అపరిచితుడు చంపేశాడు. మీలో చాలా మందికి వచ్చిన జవాబు ఇదేగా? ఒకవేళ మీ ఆన్సర్ ఇదే అయితే మీరు తప్పు చెప్పినట్టే. విక్రమ్ పాత్ర ఆ వ్యక్తిని చంపడానికి గల అసలు కారణం ఏంటి అంటే తన చెల్లి చనిపోవడానికి గల కారణం అయిన లైన్ మ్యాన్ అతనే కాబట్టి. చూశారా మీలో చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. చాలామందికి తెలిసి ఉండొచ్చు కూడా. తెలియని వాళ్ళు ఒకసారి మళ్లీ వెళ్లి సినిమా చూసి క్రాస్ చెక్ చేయండి. ఇదే కాకుండా ఈ సినిమా లో ఇంకా ఇప్పటివరకు గమనించని కొత్త విషయాలు కూడా ఏమైనా తెలియచ్చు ఏమో.
End of Article