Ads
ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురుచూసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి మూడు రోజులు అయ్యింది. ముందుగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, సెకండ్ డే నుండి సీన్ మారిపోయింది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం అది కూడా రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో మొదటి రోజు కలెక్షన్స్ భారీగానే రాబట్టింది.
Video Advertisement
అయితే రిలీజ్ అయ్యాక ఈ మూవీ పై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ చిత్రంలోని పాత్రల వేషధారణ, గ్రాఫిక్స్, డైలాగుల పై విమర్శలు వస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఆంజనేయుడు చెప్పే డైలాగుల విషయంలో తీవ్రంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా తాజాగా స్పందించారు. దానిపై కూడా నెటిజెన్లు మండిపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొంచెం విజ్ఞత, రామాయణం పైన అవగాహన ఉన్న వారందరి నుండి ఆదిపురుష్ మూవీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాని భ్రష్టు పట్టించాయని అంటున్నారు. క్యారెక్టర్ల లక్షణాలు, సందర్భాల ఔచిత్యం గురించి పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చిత్రాలకు రాసినట్టు డైలాగ్స్ రాశారు అని విమర్శిస్తున్నారు. దాంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
డైలాగ్స్ పై వస్తున్న విమర్శల పై తాజాగా స్పందించిన మనోజ్ ముంతాషిర్ శుక్లా తాను రాసిన డైలాగ్స్ ను సమర్థించుకునేలా ట్వీట్ చేశారు. దాంతో నెటిజెన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ముంతాషిర్ శుక్లా చేసిన ట్వీట్ లో ‘ఆదిపురుష్ మూవీ కోసం తాను 4000 లైన్ల డైలాగ్స్ రాసానని, అందులో 5 లైన్లు మాత్రం కొందరిని బాధపెట్టాయని, రాముడిని, సీతను కీర్తించిన చాలా డైలాగ్స్ కన్నా ఈ డైలాగ్స్ బాధించినట్టుగా అనిపిస్తోంది. అందుకే నన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే మూడు గంటల చిత్రంలో 3 నిమిషాలు ప్రజల ఊహకు భిన్నంగా రాయడంతో తనను సనాతన ద్రోహిగా చూస్తున్నారని మనోజ్ ముంతాషిర్ శుక్లా అన్నారు. నెటిజెన్లు ఈ మాటలు రచయిత మనోజ్ అహంకారాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. డైలాగ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా తప్పులు ఉన్నాయి కదా? మనం ఇంత చెప్తే వీళ్ళకి మాత్రం కేవలం డైలాగ్స్ విషయం మాత్రమే అర్థం అయ్యిందా? అంటున్నారు. ఊహలకు భిన్నంగా కాదు, రామాయణంలోని మౌలిక స్ఫూర్తికి భిన్నంగా, కించపరిచేలా డైలాగ్స్ రాసినందుకు బాధ కలుగుతుందని అంటున్నారు.
Also Read: “ప్రభాస్” తో పాటు… సినిమాల్లో “రాముడి పాత్ర” పోషించిన 12 హీరోలు..!
End of Article