“రాకేష్ మాస్టర్” చనిపోవడానికి కారణం అదేనా..? అలా అవ్వకపోయి ఉంటే..?

“రాకేష్ మాస్టర్” చనిపోవడానికి కారణం అదేనా..? అలా అవ్వకపోయి ఉంటే..?

by kavitha

Ads

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గాంధీ హాస్పటల్ లోనే తుదిశ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Video Advertisement

రాకేష్ మాస్టర్ వారం క్రితం తన స్నేహితులతో కలిసి వైజాగ్‌‌కు వెళ్ళి, రీసెంట్ గా హైదరాబాద్‌కు వచ్చారు. ఇక ఈ టూర్‌లోనే రాకేష్ మాస్టర్ అనారోగ్యానికి గురి అయ్యారు. అప్పటి నుండి లోకల్ హాస్పటల్ లో చికిత్స తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన మృతికి కారణం ఏమిటో గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్‌ తెలిపారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..rakesh-masterరాకేష్ మాస్టర్ టూర్‌ కి వెళ్ళి, వచ్చాక అనారోగ్యానికి గురై, స్థానిక ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుండి రక్తవిరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకుకెళ్లారు. రాకేష్ మాస్టర్ ను కాపాడటం కోసం డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా, సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు గాంధీ డాక్టర్లు వెల్లడించారు. రాకేశ్ మాస్టర్ చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, శిష్యులు, ఫ్యాన్స్ విలపిస్తున్నారు.
రాకేష్ మాస్టర్ మరణం గురించి గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్‌ రాజారావు మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు మధ్యాహ్నం (ఆదివారం మధ్యాహ్నం) విరోచనాలు, వాంతులు అవుతున్నాయని రాకేశ్‌ మాస్టర్‌ను హాస్పటల్ కి తీసుకొచ్చారు. కానీ అప్పటికే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. సివియర్‌ మెటబాలిక్‌ ఎసిడోసిస్‌, డయాబెటిస్‌ కావడం వల్ల మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్స్‌ అయ్యాయి. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన గంటకే మాస్టర్ ఆరోగ్యం ఇంకా విషమించింది. రాకేష్ మాస్టర్ ను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా, విఫలమవడంతో 5 గంటలకు చనిపోయారని’ అని వెల్లడించారు.
రాకేష్ మాస్టర్ బుల్లితెరపై వచ్చిన ‘ఆట’ డ్యాన్స్ షోతో కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి,  సుమారు 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. చాలాకాలంగా న్నారు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. రాకేష్ మాస్టర్ కు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది.

Also Read: ఇంత జరిగినా వీళ్ళకి అర్థం అవ్వట్లేదా..? “ఆదిపురుష్” రైటర్ ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like