“ఆదిపురుష్” విషయంలో… “వేణు స్వామి” చెప్పిందే జరుగుతోందా..?

“ఆదిపురుష్” విషయంలో… “వేణు స్వామి” చెప్పిందే జరుగుతోందా..?

by kavitha

Ads

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో దూసుకెళ్తోంది. ఈ చిత్రం మూడవ రోజు కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదిపురుష్ మూవీ మూడు రోజులలో మొత్తం 340 కోట్లు కలెక్ట్ చేసింది.

Video Advertisement

మరో వైపు ఆదిపురుష్ సినిమాపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. విమర్శల నేపథ్యంలో ఈ మూవీ ఇలాగే కొనసగుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. దాంతో గతంలో వేణుస్వామి ప్రభాస్ గురించి చెప్పిన జోస్యం నిజమవుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి అందరికి తెలిసందే. జ్యోతిష్య వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి. వేణుస్వామి ఇటీవల ఆదిపురుష్ సినిమా గురించి చెప్పారు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ట్రోల్స్, విమర్శల నేపథ్యంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతుందా అనే సందేహం  వ్యక్తమవుతోంది. ఈ మూవీకి ఇప్పటివరకు హిట్ టాక్ రాలేదు. రివ్యూలు కూడా ఆదిపురుష్ హిట్ అని, ఫ్లాప్ అని చెప్పలేకపోయాయి. వేణుస్వామి ‘ఆదిపురుష్’ రిలీజ్ కు ముందే అందరు అనుకున్నట్లుగా ఈ సినిమా హిట్ కాదని, యావరేజ్ గా నిలుస్తుందని జోస్యం చెప్పారు. బాహుబలి అంత ఊహించుకోవాల్సిన పని లేదన్నారు. రామాయణం ఆధారంగా  వస్తున్న సినిమా అయినా ఆదిపురుష్ మాత్రం అంతగా హిట్ కాదని అన్నారు. హీరో ప్రభాస్ జాతకాన్ని బట్టి ఫలితం ఉందన్నారు. Adipurushవిజువల్ వండర్ గా రూపొందించడంలో ఆదిపురుష్ మూవీ యూనిట్ సక్సెస్ అవలేదని, ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని డైరెక్టర్ ఓంరౌత్ సరిగా వినియోగించుకోలేదని, రామాయాణం స్టోరి విషయంలో సినిమాటిక్ ఫ్రీడంను ఎక్కువగా తీసుకున్నాడని అంటున్నారు. అందువల్లనే ఆడియెన్స్ పూర్తిగా ఈ మూవీ ఆమోదించడంలేదనే కామెంట్స్  వినిపిస్తున్నాయి. ఇక వేణుస్వామి చెప్పినట్టుగానే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది.

Also Read: “రావణాసురుడు అలాంటివాడు కాదు కదా..? ఆయనతో ఇలాంటి పని ఎలా చేయించారు..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like