Home Filmy Adda ఇంతకు మించిన అవమానం లేదు… అందరినీ 50 డిగ్రీల సెల్ఫీయస్ లో తగలబెట్టేయాలి..! ఏం జరిగిందంటే..?

ఇంతకు మించిన అవమానం లేదు… అందరినీ 50 డిగ్రీల సెల్ఫీయస్ లో తగలబెట్టేయాలి..! ఏం జరిగిందంటే..?

by Sainath Gopi

Ads

ఆదిపురుష్ చిత్రం పై రోజు రోజుకి వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. డైరెక్టర్ ఓంరౌత్ రామాయణాన్ని అపహాస్యం చేస్తూ ఆదిపురుష్ మూవీని రూపొందించాడని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడు, హనుమమంతుడు, రావణుడి పాత్రల వేషధారణ, వారు మాట్లాడే సంభాషణలు విషయంలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Video Advertisement

ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు కూడా చిత్రబృందం పై మండిపడుతున్నారు. ఆదిపురుష్ ను బ్యాన్ చేయాలని మరోవైపు నిరసనలు చేస్తున్నారు. అయితే రామాయణాన్ని తీసామని డైరెక్టర్ చెబుతుండగా, రామాయణాన్ని మేము అసలు తెరకెక్కించలేదు.
Mukesh-Khanna-on-Adipurush ఆంజనేయుడు దేవుడు కాదని, భక్తుడు మాత్రమే అని ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా చిత్రయూనిట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ అందరిని కాల్చేయాలని అన్నారు. ముఖేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ‘రామాయణానికి ఆదిపురుష్ ని మించిన అవమానం లేదని, డైరెక్టర్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
adipurush ban ఇక రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అర్థంలేని డైలాగ్స్ ని రాసారని, ఇటువంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని, ఈ మూవీని తీసినవారిని క్షమించకూడదు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా తెలియదని, హిరణ్యకశ్యపుడి వరాన్ని రావణుడికి చెప్పించారని, రామాయణాన్ని ఇంత అపహాస్యం చేసి, మూవీ యూనిట్ తమను తాము ఇంకా సమర్ధించు కుంటున్నారు.
adipurush ఈ మూవీ యూనిట్ మొత్తాన్ని కూడా 50 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలబెట్టి తగలబెట్టాలని అన్నారు. మూవీ పై విమర్శలు వస్తే, మౌనంగా ఉంటారని అనుకున్నాను. అయితే చిత్రయూనిట్ సనాతన ధర్మం కోసమే చేసినట్టు   చెబుతున్నారు. వారు రామాయణాన్ని మొత్తం మార్చేశారు అని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.

Also Read: “రామాయణం మీద ఎన్ని సినిమాలు అయినా తీయచ్చు..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” డైరెక్టర్ ఓం రౌత్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like