Ads
జబర్దస్త్ వేదిక నుంచి బుల్లి తెరకే కాకుండా వెండి తెరకి కూడా ఎందరో కమెడియన్స్ పరిచయం అయ్యారు. వీరిలో బాగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అప్పారావు కూడ ఒకరు. అయితే జబర్దస్త్ కమెడియన్ అప్పారావు రీసెంట్గా గొప్ప గొప్ప నటులను బతికి ఉండంగానే చంపేస్తున్నారు అని యూట్యూబ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.
Video Advertisement
ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు సోషల్ మీడియా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉందని ,అందులో ఎటువంటి డౌట్ లేదని ఆయన అన్నారు. ఎందరికో మంచిని పంచుతూ తెలియని విషయాలను తెలపడానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాని కొంతమంది అడ్డదిడ్డంగా వాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బతికి ఉండగానే కొందరు నటులు చనిపోయారు అని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై అప్పారావు తన బాధను వ్యక్తం చేశారు. ఒక మనిషిని బ్రతికి ఉండగానే చంపే అధికారం ఎవరు మీకు ఇచ్చారు అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కానీ బతికి ఉండగానే చనిపోయారు అని నోటికి వచ్చినట్లు రాయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అని అప్పారావు అంటున్నారు.
సోషల్ మీడియా ఆయుధంగా దొరికింది కదా అని దారుణంగా కామెంట్స్ పెట్టి విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా లేనిపోని వార్తలు రాసి యాక్టర్స్ ను తీవ్రమైన మానసిక శోభకు గురి చేయకండి అని ఈ ఇంటర్వ్యూలో ఆయన నెటిజనులకు విన్నవించుకున్నారు. పెద్దవారి అందరూ తరఫున వాస్తవాలు మాత్రమే రాయమని చనిపోక ముందే చనిపోయినట్లు రాయకండి అని అప్పారావు అందరినీ వేడుకున్నారు. యూట్యూబ్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది వినాలి ఎందుకంటే యూట్యూబ్ పై నేను ఒక నాటిక రాద్దామనుకుంటున్నాను…. యూట్యూబ్ నీకు ఒక దండం…అని తన బాధను వెల్లడించారు.
watch video :
ALSO READ : “సూర్యవంశం” సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?
End of Article