“సూర్యవంశం” సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?

“సూర్యవంశం” సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?

by kavitha

Ads

సూర్యవంశం, ప్రేమించుకుందాం రా వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి, ఆడియెన్స్ ని అలరించిన బాల నటుడు ఆనంద్ వర్ధన్ గుర్తున్నాడా? ఆ పిల్లోడు ఇప్పుడు హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Video Advertisement

ప్రసన్న కుమార్ దేవరపల్లి తెరకెక్కిస్తున్న ‘నిదురించు జహాపన’ అనే చిత్రంలో ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ వర్మ, సామ్ జి, నిర్మిస్తున్నారు. రోష్ని సాహోత, నవమి గయాక్‌ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఆనంద్ వర్దన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం..
anand-vardhan-1ఆనంద్ వర్ధన్ మూడున్నర సంవత్సరాలకే బాలరామాయణం చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ఆనంద్ వర్ధన్ వాల్మీకి మరియు బాలాంజనేయుడిగా రెండు క్యారెక్టర్లలో నటించాడు. ఆ తరువాత ప్రియరాగాలు మూవీలో బోర్ అనిపించగానే ఎవ‌రో ఒక‌రి బర్త్ డే  డేట్ ను ఫోన్ నెంబ‌ర్ గా డయల్ చేసి ఫోన్ ఎత్తినవారిని ఆటపట్టించే అబ్బాయిగా నటించాడు. ప్రియరాగాలు మూవీలో నటనకుగానూ ఆనంద్ వర్ధన్ నంది అవార్డు అందుకున్నాడు.
మనసంతా నువ్వే సినిమాలో చిన్నప్పటి ఉదయ్ కిరణ్ గా నటించాడు. తూనీగా తూనీగా పాటలో అలరించాడు.  వెంకటేశ్ తో సూర్యవంశం, యాక్షన్ కింగ్ అర్జున్ తో శ్రీ మంజునాధ సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘నిదురించు జహాపన’. రీసెంట్ గా నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్‌‌‌‌‌‌‌‌లో హీరో ఆనంద్ వర్ధన్ మాట్లాడారు.
‘బాలనటుడుగా ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. సినిమాలే నాకు ప్రాణం. జీవితాంతం వరకు నటిస్తూనే ఉంటా’ అని అన్నారు. ఈ మూవీ సముద్రం నేపథ్యంలో సాగే స్టోరీ అని దర్శకుడు ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో అనూప్ రూబెన్స్, హీరోయిన్స్ రోషిణి, నవమి పాల్గొన్నారు.

https://www.instagram.com/p/Ct9Djihv4k8/

Also Read: ఊహించని విధంగా “ఆదిపురుష్” కలెక్షన్స్..! ఇంత పెద్ద సినిమా పరిస్థితి కూడా ఇలా..?

 


End of Article

You may also like