Ads
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టి పదేళ్లు దాటేసిన ఇప్పటికీ హీరోయిన్ గా ఆఫర్స్ ను అందుకుంటునే ఉంది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని, ఒక బాబుకు తల్లి అయ్యే దాకా కాజల్ సినిమాలకు దూరంగానే ఉంది. ఇప్పుడు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో బిజీగా మారింది.
Video Advertisement
ఒకవైపు శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తూనే, మరో వైపు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. సత్యభామ అనే చిత్రంలోనూ నటిస్తోంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తన ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించింది. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వాటిలో భాగంగా పోస్ట్ పార్టమ్ (ప్రసవానంతర) డిప్రెషన్ ను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది.
ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. స్త్రీలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమస్యతో బాధపడుతుంటే ఫ్యామిలీ వారికి అండగా ఉండాలని సూచించింది. ఆ సమయం తనకు చాలా భారంగా ఉండేదని, అప్పుడే ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం ప్రారంభించాను.
అలాగే ఇష్టమైన వారితో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించే దాన్ని. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో నా భర్త గౌతమ్ ఎంతో మద్దతుగా నిలిచారని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనను అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటకు రాగలిగానని చెప్పింది.
Also Read: ARTHAMAYYINDHA ARUN KUMAR : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article