Ads
ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీ మంచి కొరియోగ్రఫర్ ని కోల్పోయింది. రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే టాలీవుడ్ తో పాటుగా మాస్టర్ శిష్యులు, ఆడియెన్స్ షాక్‌కి గురయ్యారు.
Video Advertisement
రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్, గణేష్, జానీ మాస్టర్స్ రాకేష్ మాస్టర్ పాడె మోసి తమకు డాన్స్ నేర్పిన గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల నిర్వహించిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన శిష్యులు శేఖర్, సత్య మాస్టర్లు పాల్గొని, ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలు పాల్గొన్నారు. ఈ సంతాప సభకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ డైరక్టర్ వైవీఎస్ చౌదరి హాజరు అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మూవీలో 4 సూపర్ హిట్ సాంగ్స్‌కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన శిష్యులు రాకేష్ మాస్టర్ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రాకేష్ మాస్టర్ పేరుతో జాతీయ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు.
చాలామందికి డ్యాన్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్ ని మర్చిపోకుండా ఉండేందుకు శేఖర్, సత్య మాస్టర్లు ఈ జాతీయ పురస్కారాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని మాస్టర్ సంతాప సభలో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన నాగబాల సురేష్ కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి చెప్తూ ఢీ షోలో కన్నీరు పెట్టుకున్నారు. ఈ షోకి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఢీ షో ఎపిసోడ్ ప్రోమోలో రాకేష్ మాస్టర్ ఓల్డ్ వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కాళ్లు మొక్కిన వీడియో చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, “మాస్టర్ గారితో 7, 8 ఏళ్ల జర్నీ. చాలామంది తెలిసీ, తెలియక మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పై నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు.
Also Read: ARTHAMAYYINDHA ARUN KUMAR : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article