Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ స్టోరీ గురించి ఎలాంటి ఇన్‌ఫర్మేషన్ లేదు. సూపర్ నేచురల్ ఫిల్మ్, సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతోంది అని మాత్రమే వినిపిస్తోంది.
Video Advertisement
అయితే ఈ చిత్ర కథ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిపురుష్ సినిమాలో దశావతారాలలో ఒకటైన శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్, ఈ సినిమాలో మరో అవతారంలో కనిపిస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ తిరుగుతోంది. మరి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.ప్రభాస్, దీపికా పదుకొనె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, హాలీవుడ్ మార్వెల్ సినిమాల వలె చెడు పై మంచి సాధించే గెలుపు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథలో పురాణాలను కూడా చేర్చాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణుమూర్తి ఆఖరి అవతారం అయిన కల్కి పాత్రలో నటిస్తున్నాడని, ఈ మూవీ పోస్టర్‌లో కనిపిస్తున్న చేయి ఆయనదే అని నెట్టింట్లో వార్తలు షికారు చేస్తున్నాయి.
ప్రభాస్ టెక్నాలజీ సహాయంతో మోడరన్ విలన్స్‌తో ఎలా పోరాడతాడనేది స్టోరీ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్‌తో నిర్మిస్తున్నారు. ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.
Also Read: “ఈ సారి మాములుగా ఉండదు..!” అంటూ… “అల్లు అర్జున్- త్రివిక్రమ్” సినిమా అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!
End of Article