Ads
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు సాధారణంగా చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం పెళ్లి పేరుతో మోసపోతున్నారు. ప్రస్తుతం పెళ్లి సంబంధాలను మాట్రిమోని వేదికగా వెతుకుతున్నారు. వాటిని ఉపయోగించుకున్న ఒక యువతి ఒకరికి తెలియకుండా ఇంకొకరి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని తీసుకొని పారిపోతున్న ఒక నిత్య పెళ్లికూతురు లీలలు వెలుగుకోకి వచ్చాయి.
Video Advertisement
అయితే తాజాగా ఆ నిత్య పెళ్లికూతురు వల్ల బాధితుడిగా మారిన వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ నిత్య పెళ్లికూతురు బండారం బయట పెట్టారు. ఇప్పటివరకు ఆమె నలుగురిని వివాహం చేసుకున్నట్లు తేలింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంకి చెందిన అనూష మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తుంది. ఒకరితో వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కాపురం చేసి, ఆపైన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లడం. ఆ తరువాత మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా అనూష ఇప్పటిదాకా నలుగురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన సుద్దాల రేవంత్ అనే బాధితుడు అనూష పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో అనూష బండారం బయటికి వచ్చింది. పెద్దపల్లికి చెందిన రేవంత్‌కు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా అనూషతో పరిచయం కలిగింది. పరిచయం పెరగడంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి జరగక ముందే అనూష అవసరం ఉందని అడగడంతో రేవంత్ రెండు లక్షల రూపాయలు ఆన్‌లైన్ లో పంపించాడు. 2022లో డిసెంబర్ 14న అనూష – రేవంత్ ల పెళ్లి జరిగింది. 70 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అనూషకు ఇచ్చాడు.
పెళ్లి అయిన తరువాత రేవంత్ తో 2 నెలలు కాపురం చేసిన తరువాత అనూష ఇంట్లోని డబ్బు, బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అనుషను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయినట్లు తెలియడంతో రేవంత్ షాక్ అయ్యిమోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై CRS నివేదికలో బయటికి వచ్చిన నిజం..! తప్పు అక్కడే జరిగిందా..?
End of Article