కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై CRS నివేదికలో బయటికి వచ్చిన నిజం..! తప్పు అక్కడే జరిగిందా..?

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై CRS నివేదికలో బయటికి వచ్చిన నిజం..! తప్పు అక్కడే జరిగిందా..?

by Mohana Priya

Ads

గత నెల ఒడిస్సా లోని బాలేశ్వర వద్ద జరిగిన రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక తప్పుడు సిగ్నల్స్ ఇవ్వడమే ప్రధాన కారణమని రైల్వే భద్రతా కమిషనర్ దర్యాప్తు నివేదికలో స్పష్టంగా తెలియపరిచారు. అంతేకాకుండా ఈ యాక్సిడెంట్ వెనుక వేరువేరు స్థాయిలలో జరిగినటువంటి వైఫల్యాలు కూడా కారణమని పేర్కొన్నారు .

Video Advertisement

తప్పుడు వైరింగ్ మరియు కేబుల్ అనుసంధానత కారణంగానే 2022 మే 16 వ తారీఖున కూడా ఆగ్నేయరైల్వే ఖరగ్పూర్ డివిజన్‌లో ఇదే తరహా దుర్ఘటన చోటు చేసుకుందని. కనీసం ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా లోపాలను సరి చేసుకొని ఉంటే కోరమండల్‌‌కు ప్రమాదం తప్పేదని వారు అభిప్రాయపడ్డారు.

ఆగి ఉన్న గూడ్స్ రైలు బండిని బహానగాబజార్ రైల్వేస్టేషన్ ఢీ కొట్టిన కారణంగానే పట్టాలు తప్పిన కోరమండల్ యొక్క రైలు బోగీలు ఎగిరి పక్కన వస్తున్న యశ్వంతపూర్ యొక్క చివరి పెట్టెను ఢీకొట్టడం జరిగింది. జరిగినటువంటి ప్రమాదంలో 292 మంది తమ ప్రాణాలు పోగొట్టుకోగా వేయి మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీనిపై సిబిఐ దర్యాప్తు కూడా చేపట్టింది. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం ప్రమాదానికి కారణమైనటువంటి అంశాలు తెలుసుకుందాం…సిగ్నల్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, రెండు సమాంతర మార్గాలను కలిపే స్విచ్లు పలుమార్లు తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయని బహానగాబజార్ స్టేషన్ మేనేజర్ చేసిన ఫిర్యాదు పై సిగ్నల్ టెలికాం సిబ్బంది తగు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.అలాగే ఈ స్టేషన్ సమీపంలో ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బ్యారియర్ నిర్దిష్ట సర్క్యూట్ డయాగ్రమ్ సరఫరా చేయకపోవడంతో .. వైరింగ్ మార్చినప్పటికీ అది పనిచేయడంలో విఫలమయింది.

ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పందన అనేది వెంటనే ఉండాలి. రైల్వే జోన్లకు మరియు విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సరియైన సమన్వయం లేకపోవడంతో సిగ్నలింగ్ తప్పిదం వల్ల గూడ్స్ రైలును వెనుక వైపు నుంచి కోరమాండల్ ఢీకొట్టడం జరిగింది.సిగ్నల్ సర్క్యూట్లను మార్చినప్పుడు వాటి పనితీరు పరీక్షించి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఇటువంటి వాటిని రెగ్యులర్గా తనిఖీ చేయడానికి ఓ ప్రత్యేకమైన బృందాన్ని కూడా నియమించాలి.అయితే ఇటువంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోకపోవడం వల్ల పెను ప్రమాదం సంభవించింది.

ALSO READ : “కోరమాండల్ ఎక్స్‌ప్రెస్” సంఘటనతో పాటు… భారతదేశాన్ని కుదిపేసిన 6 “ట్రైన్ ప్రమాదాలు” ఇవే..!


End of Article

You may also like