ఒడిశాలో బాలేశ్వర్ సమీపంలోని బహనగా వద్ద శుక్రవారం రాత్రి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఒక గూడ్సు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకూ 233 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Video Advertisement

భారతీయ రైల్వే చరిత్రలోనే దీనిని అత్యంత విషాదకర ఘటనగా అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రమాదం జరగడంపై అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన భయంకరమైన దుర్ఘటనలేవో ఇప్పుడు చూద్దాం..

#1 ఫిరోజాబాద్ రైలు ప్రమాదం

1995 లో ఆగస్టు 20 వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళ్తున్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ కాళింది ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 358 మంది మరణించారు. ఒక ఆవును ఢీకొనడంతో కాళింది ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పైనే ఆగిపోయింది. మరోవైపు పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను కూడా అదే ట్రాక్‌పై నడిపేందుకు అనుమతించారు. ఈ క్రమంలో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ కాళింది ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.

tragic train accidents of india..!!

#2 అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ ప్రమాదం

1999 ఆగస్టు 2 న బీహార్‌లోని కతిహార్ డివిజన్‌లోని గసల్ వద్ద అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ మరియు బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 268 మంది మృతి చెందగా, 359 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కూడా సిగ్నల్ లోపం వల్లే జరిగింది. బ్రహ్మపుత్ర మెయిల్ కూడా అదే ట్రాక్‌లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రహ్మపుత్ర మెయిల్ అస్సాం ఎక్స్‌ప్రెస్‌ని ముందు నుంచి ఢీకొట్టింది.

tragic train accidents of india..!!

#3 ఖన్నా రైలు ఆక్సిడెంట్

26 నవంబర్ 1998న, పంజాబ్‌లోని ఖన్నా వద్ద అమృత్‌సర్‌కు వెళ్లే ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్ పట్టాలు తప్పింది. ఆ మూడు కోచ్‌లను జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 212 మంది మరణించారు.

tragic train accidents of india..!!

#4 జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం

2010 మే 28 న ముంబైకి వెళ్లే హౌరా కుర్లా లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పేలుడు కారణంగా పట్టాలు తప్పింది. దీని తర్వాత అర్ధరాత్రి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 170 మంది చనిపోయారు.

tragic train accidents of india..!!

#5 బీహార్‌ రైలు ప్రమాదం

దేశంలోనే అత్యంత బాధాకరమైన రైలు ప్రమాదంగా చెప్పుకునే ఈ ప్రమాదం 42 ఏళ్ళ క్రితం జరిగింది. జూన్ 6, 1981న బీహార్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో సుమారు 800 మంది మరణించారు. బీహార్‌లోని సహర్సాలో ప్యాసింజర్ రైలు బాగ్మతి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

tragic train accidents of india..!!

#6 ఒడిశా రైలు ప్రమాదం

ఇక తాజాగా జరిగిన ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగింది. వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కి రూుట్ ఇవ్వడానికి అదే ట్రాక్ మీదున్న గూుడ్స్ ని లూప్ లోకి రైల్వే అధికారులు పంపారు. అయితే మెయిన్ లైన్లో 110కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాక సిగ్నలింగ్ లోపంతో లూప్ లైన్లో కి వెళ్లిపోయింది.

tragic train accidents of india..!!

అదే మెయిన్ లైన్ అనుకుని లూప్ లైన్లో వెళ్లి అదే ట్రాక్ పై ఉన్న గూడ్స్ ని ఢీకొట్టింది కోరమాండల్. కోరమాండల్ భోగీలు గూడ్స్ రైలు భోగీల పైకి ఎక్కాయి. ఈ ఘటనతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ భోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పై పడ్డాయి. పదహారు నిమిషాలు తర్వాత పక్క ట్రాక్ మీదకు వచ్చిన యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో సుమారు 300 మంది మరణించారు.