“కొంపెల్ల మాధవి లత – కొంపెల్ల విశ్వనాథ్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

“కొంపెల్ల మాధవి లత – కొంపెల్ల విశ్వనాథ్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

by Harika

Ads

హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ప్రస్తుతం ప్రచార పనుల్లో ఉన్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ వాళ్లు మాధవి లత పేరుని ప్రకటించారు. అప్పుడు మాధవి లత వార్తల్లో నిలిచారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీకి దిగుతున్నారు. గత బుధవారం మాధవి లత బిజెపి పార్టీ నుండి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మాధవి లత భర్త పేరు విశ్వనాథ్. హైదరాబాద్ లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విరించి హాస్పిటల్స్ అధినేత విశ్వనాథ్. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంపెల్ల మాధవి లత కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు.

Video Advertisement

kompella madhavi latha vishwanath love story

ఆ ఇంటర్వ్యూలలో రాజకీయాలకు సంబంధించిన విషయాలు చాలా మాట్లాడారు. దాంతో పాటు కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. అందులో, వారి పెళ్లి ఎలా జరిగింది అనే విషయాన్ని కూడా కొంపెల్ల మాధవి లత చెప్పారు. మాధవి లత విశ్వనాథ్ గురించి మాట్లాడుతూ, చాలా కళాత్మకమైన వ్యక్తి అని చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి అని అప్పట్లోనే విశ్వనాథ్ పేపర్ లో ప్రకటన వేయించారు. దాదాపు 1800 మంది అమ్మాయిలు ఈ ప్రకటన చూసి విశ్వనాథ్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం వ్యక్తం చేశారు.

kompella madhavi latha assets

మాధవి లత ఇంట్లో కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ మాధవి లతకి పెళ్లి మీద అంత పెద్ద ఆసక్తి లేదు. ఒకరోజు మాధవి లత నాన్నగారు వచ్చి మాధవి లతకి ఈ పేపర్ ప్రకటన చూపించారు. చూసిన వెంటనే, విశ్వనాథ్ ఫోటో చూడకుండానే తనే మాధవి లతకి కాబోయే భర్త అని మాధవి లత అనుకున్నారు. విశ్వనాథ్ ని కలవడానికి మాధవి లత వెళ్లారు. విశ్వనాథ్ మాధవి లతని దూరం నుండి చూసి, పత్రిక వాళ్ళకి ఫోన్ చేసి, ఆరోజు పెళ్లి కోసం అమ్మాయిలు కావాలి అనే దాని గురించి ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు అని చెప్పారట.

kompella madhavi latha vishwanath love story

అంటే విశ్వనాథ్ కూడా మాధవి లతని చూడంగానే ఇష్టపడ్డారు. అయితే, మాధవి లతలో ఎలాంటి విషయాలని విశ్వనాథ్ ఇష్టపడ్డారు అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగగా, విశ్వనాథ్ కి కళలు అంటే చాలా ఇష్టం అని మాధవి లత చెప్పారు. మాధవి లత ఒక నృత్యకారిణి అని కూడా చెప్పారు. విశ్వనాథ్ కి జీవితం పట్ల చాలా స్పష్టత ఉంది అని, చాలా బాగా రాస్తారు అని మాధవి లత తెలిపారు.

watch video :

ALSO READ: హీరోయిన్ నగ్మా గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా మారిపోయారో చూసారా..?


End of Article

You may also like