తెలుగు సినిమా… తమిళ సినిమా..? రెండిట్లో ఏది ముందు పుట్టిందో తెలుసా..?

తెలుగు సినిమా… తమిళ సినిమా..? రెండిట్లో ఏది ముందు పుట్టిందో తెలుసా..?

by Mohana Priya

Ads

సినిమా. ఇది లేకుండా ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం. సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. ఎమోషన్ అయిపోయింది. అందుకే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమా వాళ్లు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ల కష్టాన్ని కూడా గుర్తించిన ప్రేక్షకులు, వారిని తమ వాళ్ళుగా అనుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ ఎన్నో భాషల్లో ఉంది. ఎవరి ఇండస్ట్రీ వాళ్లకి గొప్ప ఇండస్ట్రీ అనుకుంటారు. ఈ మధ్య ప్రతి సినిమాని ఇతర భాష వాళ్ళు కూడా చూడటం మొదలుపెట్టారు. దాంతో వేరే ఇండస్ట్రీలో సినిమాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రేక్షకులకి తెలుస్తోంది.

Video Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళకి గర్వకారణం. మా తెలుగు సినిమా అని మన తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ తమిళ వాళ్ళకి గర్వకారణం. మా తమిళ సినిమా గొప్ప అని వాళ్ళు కూడా అంత గొప్పగా చెప్పుకుంటారు. రెండు ఇండస్ట్రీలకి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. రెండు ఇండస్ట్రీలలో పని చేసే వాళ్ళు స్నేహంగానే ఉంటారు. కానీ ఈ రెండు ఇండస్ట్రీల సినిమాలు వస్తే మాత్రం మా సినిమా గొప్ప అంటే, మా సినిమా గొప్ప అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా మన సినిమాలను వాళ్ళు రీమేక్ చేసినా, వాళ్ల సినిమాలని మనం రీమేక్ చేసినా కూడా రెండిటినీ పోలుస్తూ కామెంట్స్ వస్తాయి.

telugu cinema or tamil cinema which is older

అయితే, అసలు రెండు భాషల ఇండస్ట్రీలలో ఏ ఇండస్ట్రీ ముందు పుట్టిందో తెలుసా. ఈ విషయం మీద సోషల్ మీడియాలో చాలానే చర్చలు జరిగాయి. అన్ని చర్చల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మొదటి తమిళ సినిమా అయిన కీచక వధం 1916 లో విడుదల అయ్యింది. ఈ సినిమా ఒక మూకీ సినిమా. ఈ సినిమాకి ఆర్ నటరాజ ముదిలియార్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ, 1931 లో కాళిదాసు అనే సినిమా విడుదల అయ్యింది.

telugu cinema or tamil cinema which is older

ఇది మొదటి తమిళ టాకీ సినిమా. ఈ సినిమాని పలు భాషల్లో రూపొందించారు. ఇంక తెలుగు సినిమా విషయానికి వస్తే, 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అనే ఒక మూకీ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాని రఘుపతి వెంకయ్య నాయుడు నిర్మించారు. ఆ తర్వాత 1933 లో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ వాళ్లు నిర్మించిన సావిత్రి సినిమా విడుదల అయ్యింది. ఇలా చూస్తే తమిళ్ ఇండస్ట్రీ ముందు పుట్టింది. 1909 నుండి రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు సినిమాని నిర్మించడానికి కృషి చేశారు. కానీ 1921 లో మొదటి సినిమా విడుదల అయ్యింది. ఈ కారణంగానే తమిళ సినిమా ముందు పుట్టింది.


End of Article

You may also like