“సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!

“సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!

by Mohana Priya

Ads

సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

Video Advertisement

కానీ కొంత మంది హీరోయిన్లు, డైరెక్టర్లని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అలా డైరెక్టర్లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సుహాసిని – మణిరత్నం

సుహాసిని గారు, దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#2 ఖుష్బూ – సుందర్

నటి ఖుష్బూ, కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#3 రోజా – సెల్వమణి

అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలని కూడా సమానంగా బాలన్స్ చేస్తూ, ఇప్పటికీ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, టీవీ షోస్ ద్వారా మనల్ని అలరిస్తున్న రోజా కూడా దర్శకులు సెల్వమణి గారిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#4 శోభ – బాలు మహేంద్ర

భారతదేశంలో గొప్ప దర్శకులలో ఒకరైన బాలు మహేంద్ర గారు, నటి శోభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1980 లో శోభ గారు ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత బాలు మహేంద్ర గారు 1998 లో మౌనిక అనే నటిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ వారి పెళ్లి గురించి 2004 లో ఎనౌన్స్ చేశారు. బాలు మహేంద్ర గారు మొదట అఖిలేశ్వరి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నటి కాదు.

Heroines who married directors

#5 శరణ్య – పొన్వన్నన్

నటి శరణ్య గారు, నటులు, దర్శకులు పొన్వన్నన్ గారిని పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#6 దేవయాని – రాజకుమారన్

నటి దేవయాని గారు కూడా, రాజకుమారన్ అనే దర్శకుడి ని పెళ్లి చేసుకున్నారు. దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ 2001 లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#7 రమ్య కృష్ణ  కృష్ణ వంశీ

రమ్య కృష్ణ గారు, స్టార్ దర్శకుడు కృష్ణ వంశీ గారిని పెళ్లి చేసుకున్నారు.

Heroines who married directors

#8 నయనతార- విఘ్నేష్ శివన్

లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా దర్శకుడు విఘ్నేష్ శివన్ ని నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రేమించారు. వీరిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. దాదాపు 7 సంవత్సరాలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు.

nayanthara vighnesh shivan marriage

#9 ప్రీత – హరి

రుక్మిణి, ప్రియమైన నీకు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి ప్రీత కూడా, దర్శకులు హరిని పెళ్లి చేసుకున్నారు. హరి తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సింగం సిరీస్, సూర్య హీరోగా నటించిన ఆరు, విశాల్ హీరోగా నటించిన భరణి, పూజ, విక్రమ్ హీరోగా నటించిన సామి స్క్వేర్, అలాగే దీని మొదటి పార్ట్ సామితో పాటు ఇంకా ఎన్నో తమిళ్ సినిమాలకి దర్శకత్వం వహించారు.

Heroines who married directors

వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ నటి యామీ గౌతమ్, అలాగే ఎంతో మంది హీరోయిన్లు డైరెక్టర్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


End of Article

You may also like