ఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఇంత స్టైలిష్ గా అయిపోయారేంటి..?

ఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఇంత స్టైలిష్ గా అయిపోయారేంటి..?

by Mounika Singaluri

Ads

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎందరో టాలెంటెడ్ పీపుల్ బయటికి వస్తున్నారు. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సోషల్ మీడియా లేని రోజుల్లో వారి కుటుంబ పరిస్థితులు కారణంగా చేయాలనుకున్నవి చేయలేకపోయిన వారందరూ కూడా ఇప్పుడు తమ కలనీ నెరవేర్చుకుంటున్నారు. కొందరికి డాన్స్ అంటే ఇష్టం, కొందరికి పాటలు పాడటం ఇష్టం, కొందరికి నటన ఇష్టం, కొందరికి వంటి ఇష్టం, కొందరికి ఆటలు ఇష్టం.

Video Advertisement

ఇలా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోనూ తమ ఇష్టాలను వ్యక్తపరిచే విధంగా వీడియోలు చేసి ఫాలోవర్స్ ని సంపాదించుకొని సెలబ్రిటీలు గా మారుతున్నారు.వీరికి ఎందరో ఫాన్స్ కూడా ఉంటున్నారు. వీరు చేసే వీడియోలు షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం.

ఈయన 60 ఏళ్ల వయసు సెలబ్రిటీ. పేరు పళని స్వామి. ఇంస్టాగ్రామ్ వాడేవారికి, యూట్యూబ్ ని వాడేవారికి ఈయన గురించి తెలియకుండా ఉండదు. స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. సంస్కృతి సాంప్రదాయాలు, శాస్త్రాలలో దిట్ట. అచ్చంగా తెలుగు మాట్లాడతారు. స్వచ్ఛమైన వంటలు చేస్తారు.ఇంస్టాగ్రామ్ లో పురాతన వంటల్ని, పాతకాలపు రుచుల్ని పరిచయం చేస్తూ ఈయన చేసే వీడియోలు ఉంటాయి చూడండి వర్ణనాతీతం. వంట ఉండేటప్పుడు ఈయన చెప్పే విధానాన్ని వింటే చాలు నోట్లో నీళ్లు ఊరతాయి.ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది.

అలాగే ఈయనకి దైవభక్తి కూడా ఎక్కువే. వివిధ దేవుళ్ళకి పూజలు చేస్తూ తన భక్తిని చాటుతూ ఉంటారు. నటన అన్న కూడా విపరీతమైన ఆసక్తి ఈయనకి.ప్రాచీన గ్రంథాల్లోనూ, కథల్లో ఉండే పాత్రల వేషధారణలో ఈయన కనిపిస్తూ ఉంటారు. ఒక్కసారి మెప్పిస్తారు ఒక్కోసారి భయపెట్టిస్తారు కూడా.ఈతనని పరిచయం చేయకుండా మోడ్రన్ గెటప్ లో ఉన్న ఈయనను చూస్తే 60 ఏళ్ల మోడల్ అనుకోక మానరు. స్టైలిష్ గా మారి నేటి యూత్ కి ఏ మాత్రం తీసిపోను అన్న విధంగా ఈయన వేషధారణ ఉంటుంది. ఏది ఏమైతేనేం తనలోని టాలెంట్ ని బయటకు తీస్తూ 60 ఏళ్ల వయసులో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎందరికో ఆదర్శం.

Watch Video:

Also Read:సద్గురు” భార్య ఎవరో తెలుసా..? ఆవిడ ఎలా చనిపోయారు..?


End of Article

You may also like