జగ్గీ వాసుదేవ్ అలియాస్ సద్గురు ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ప్రముఖ యోగా గురువు, మోటివేషనల్ స్పీకర్. ఇషా ఫౌండేషన్ స్థాపించి సద్గురు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అనేక దేశాల్లో సద్గురుకి శిష్యులు ఉన్నారు భక్తులు ఉన్నారు. సద్గురు స్పీచెస్ వినడానికి వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే సద్గురు భార్య విజయ్ కుమారి మహాసమాధి అయ్యారు. అయితే ఆమె మరణం వెనకాల సద్గురు ఉన్నారంటూ పోలీసులు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. హిందూ కల్చర్ లో ఒక మనిషి తన శరీరానికి ఎటువంటి గాయం చేయకుండా విడిచి వెళ్లిపోవడం ఎప్పటినుండో ఉంటుంది. దాన్ని మహాసమాధి అని అంటుంటారు. పురాతన యోగులు మునులు చాలా సంవత్సరాలుగా మహాసమాధిని తీసుకున్నారు. సద్గురు భార్య విజయ్ కుమారి 1997 జనవరి 23న మహాసమాధి అయ్యారు. ఇది తర్వాత చాలా కాంట్రవర్సీ అయింది.

 అయితే విజయ్ కుమారి ముందుగా యోగా టీచర్ గా, బ్యాంకర్ గా, వాలంటీర్ గా పనిచేసేవారు. ఆమె సద్గురు భార్యగా అందరికీ పరిచయం. ఆమె కూతురు రాదే జగ్గి ఇండియన్ క్లాసికల్ డాన్సర్.
ఆమె చనిపోయినప్పటినుండి ఆమె మరణానికి చాలామంది కారణాలు అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆమె తన ఇష్టపూర్వకంగానే మహా సమాధి అయ్యారని కొందరు అంటూ ఉంటారు.ఆమె సద్గురుని 1984లో మొదటిసారిగా మైసూర్ సిటీలో విజయ్ కుమారి సద్గురుని కలిశారు తర్వాత ఒకరికొకరు నచ్చడం, సహజీవనం చేయడం జరిగింది. 1985 మే 20న వీరి పెళ్లి జరిగింది.

జనవరి 23 1997న ఆమె మహాసమాధి అయ్యారు. ఆమె మరణం తర్వాత 12 గంటలకు ఆమెను దహనం చేశారు. అది కాంట్రవర్సీ అవ్వడంతో విజయ్ కుమారి తండ్రి కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ లో సద్గురు మీద కేసు పెట్టారు.తర్వాత ఎనిమిది నెలలపాటు ఈ కేసు విచారణ కొనసాగాయి. భార్య మరణం గురించి సద్గురుని కూడా విచారించారు. ఆమె మరణానికి ముందు డాక్టర్లు పరిశీలించి ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోతుంది అని తెలిపారు.

తర్వాత ఆమెకి పోస్టుమార్టం అనేది చేయలేదు. తర్వాత ఆమె ఆస్తికలను ఫోరెన్సిక్ టెస్ట్ కి పంపించిన కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో 1999 జనవరి 8న కోర్టు ఈ కేసును కొట్టివేసింది.విజయ్ కుమార్ కి సద్గురుకి పెళ్లయిన తర్వాత 6 సంవత్సరాలకి కూతురు రాదే జగ్గి పుట్టింది. ఆమెకు ఏడు సంవత్సరాలు ఉండగా విజయ్ కుమారి చనిపోయింది. 2014లో రాదే 24 సంవత్సరాల అప్పుడు సందీప్ నారాయణ వివాహం చేసుకుంది. ఇషా ఫౌండేషన్ లో ఈ వివాహం జరిగింది.

Also Read:కీడా కోలా ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?