వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకుంటూనే…ఇంటర్ లో 927 మార్కులు సాధించిన విద్యార్థిని.!

వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకుంటూనే…ఇంటర్ లో 927 మార్కులు సాధించిన విద్యార్థిని.!

by Mohana Priya

Ads

ఒక మనిషికి ఏదైనా సాధించాలి అని తపన ఉంటే చాలు. ఆ తపన ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. తన పరిస్థితులు ఏవి కూడా ఆ మనిషికి అడ్డం కావు. ఇదే విషయాన్ని చాలా మంది నిరూపించారు. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఇదే విషయాన్ని నిరూపించండి. వివరాల్లోకి వెళితే, ఐ డ్రీమ్ పోస్ట్ కథనం ప్రకారం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న గోదావరిఖనికి చెందిన కూనరపు సిరి అనే అమ్మాయి ఇంటర్లో సీఈసీ గ్రూపులో 927 మార్కులు సాధించింది. సిరి గత ఐదు సంవత్సరాలు నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. 8 నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. వారానికి రెండు రోజులు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరి కుటుంబం ఎన్టీపీసీ కృష్ణనగర్ లో నివసిస్తున్నారు.

Video Advertisement

siri intermediate marks peddapally

Source : idream post

సిరి తల్లిదండ్రులు కూనారపు పోశం, వెంకట లక్ష్మి. సిరి తండ్రి అక్కడ సెంట్రింగ్ పని చేస్తున్నారు. వీళ్ళకి సిరితో పాటు, మరొక కూతురు కూడా ఉంది. సిరి ఇద్దరిలో పెద్ద కూతురు. ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించాలి అని ప్రయత్నించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. సిరి పరిస్థితిని కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తెలుసుకున్నారు. దాంతో ఫోన్ ద్వారా పాఠాలు చెప్పారు. స్నేహితుల ద్వారా సిరికి వాళ్ళు చెప్పే పాఠాలు అందేలాగా చేశారు.

ఏదైనా సబ్జెక్ట్ లో ఏదైనా డౌట్ వస్తే మెసేజ్ ద్వారానే క్లియర్ చేసేవాళ్లు. మరొక పక్క సిరి తల్లిదండ్రులు కూడా సిరికి మద్దతు ఇచ్చారు. సిరి వారంలో రెండు రోజులు డయాలసిస్ చేయించుకుంటూనే పరీక్షలకి ప్రిపేర్ అయ్యింది. దాంతో మొన్న బుధవారం విడుదల అయిన ఫలితాల్లో 927 మార్కులు సాధించింది. ఇంత గొప్ప మార్కులు సాధించడం మాత్రమే కాకుండా, కాలేజ్ టాపర్ కూడా అయ్యింది. కూతురి కిడ్నీ మార్పిడి కోసం వైద్య చికిత్స చేయించడానికి ప్రభుత్వం వారికి మద్దతు చేయాలి అని, అంతే కాకుండా, దాతలు కూడా వారికి సహాయం చేయాలి అంటూ సిరి తండ్రి పోశం కోరారు. పట్టుదలతో ఏదైనా సాధించగలరు అని సిరి నిరూపించింది.

ALSO READ : చెప్పిన మాట నిలబెట్టుకున్న “బర్రెలక్క”… ఎంపీ గా నామినేషన్.! ఆ బలమైన నాయకుడిపై గెలిచేనా.?


End of Article

You may also like