బుక్ మై షోను కుదిపేస్తున్న సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?

బుక్ మై షోను కుదిపేస్తున్న సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?

by kavitha

Ads

హాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ సినిమాలలో ‘ఓపెన్‌హైమర్’ ఒకటి. ఈ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత క్రిస్టోఫర్ నోలన్ రూపొందించాడు. ఈ మూవీ తొలిసారి అణు బాంబును సృష్టించిన శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.

Video Advertisement

‘ఓపెన్‌హైమర్’ మూవీ జులై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం కావడం, సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ కథతో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమా పై అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉన్నాయి.
హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ప్రపంచమంతా మెచ్చే దర్శకులలో క్రిస్టఫర్ నోలాన్ ఒకరు. క్రిస్టఫర్ తీసిన ప్రతి చిత్రం కూడా అద్భుతమే. ఆయన గతంలో ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, ద ప్రిస్టిజ్, టెనెట్, డార్క్ నైట్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. చివరగా 2020లో ‘టెనెట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ని పలకరించిన క్రిస్టఫర్, మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.
‘ఓపెన్‌హైమర్’ మూవీ కేవలం అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ మూవీ అంతా అణుబాంబు కాన్సెప్ట్ చుట్టునే తిరుగుతుందని తెలుస్తోంది. దానివల్లే ఈ చిత్రం పై అంచనాలు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ఇప్పటి దాకా ఈ మూవీ పై లక్షన్నర మంది ఇంట్రెస్ట్ కనబర్చినట్టుగా తెలుస్తోంది. ఒక మూవీ పై రిలీజ్ కు ముందు ఇంత ఆసక్తి చూపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉంది. అయితే ఇప్పటికే బుక్ మై షో లో లక్షన్నర మంది ఈ సినిమా పై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ టై కు ఈ సంఖ్య 3 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.  ఈ రేంజ్ లో ఇండియాలో ఈ మూవీ పై ఆసక్తి ఉండటంతో ఈ మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: ఏజెంట్ OTT రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతోంది..? కారణం ఇదేనా..?


End of Article

You may also like