ఫస్ట్ యాడ్‌ కు “సితార” అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఫస్ట్ యాడ్‌ కు “సితార” అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ టాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరు. ఆయన సినిమాల ద్వారా ఎంత ఆదాయం పొందుతారో, ప్రకటనల ద్వారా అంతకు మించి సంపాదిస్తారనే విషయం తెలిసిందే.

Video Advertisement

మహేష్ తనయ సితారకు చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార డ్యాన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా సితార నటించిన ఒక యాడ్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. అయితే ఆమె ఈ యాడ్ కు అందుకున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Sitara-Ghattamaneniసూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె సినిమాలలో నటించకపోయినా, తన టాలెంట్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తన డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు. ఇప్పటివరకు సితార ఇన్ స్టాగ్రామ్ లో 642 పోస్టులను మాత్రమే చేసింది. వాటితోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పొందారు.
12 సంవత్సరాల సితార ఇటీవల జ్యువెలరీ యాడ్ యాడ్ లో నటించింది. ఆమె నటించిన ఈ యాడ్ సెన్సషన్ గా మారింది. ఈ జ్యువెలరీ యాడ్ ను న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సితార గురించి మహేష్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే ఈ యాడ్ లో నటించడం కోసం సితార అందుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సితార ఈ జ్యువెలరీ యాడ్ కి అందుకున్న రెమ్యునరేషన్ కోటి రూపాయలని సమాచారం. సితార భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలలో కనిపిస్తారని తెలుస్తోంది.

Also Read: “ఎలివేషన్స్ ఇవ్వడంలో నీల్ తర్వాతే ఎవ్వరైనా..!” అంటూ… ప్రభాస్ “సలార్” టీజర్‌పై 15 మీమ్స్..!

 


End of Article

You may also like