ప్రభాస్ “సలార్” టీజర్‌లో చూపించిన… “సీజ్‌ఫైర్” అనే పదం అర్ధం ఏంటో తెలుసా..?

ప్రభాస్ “సలార్” టీజర్‌లో చూపించిన… “సీజ్‌ఫైర్” అనే పదం అర్ధం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

డార్లింగ్ ప్రభాస్ వరుస లైన్ అప్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఆది పురుష్ చిత్రం ఊహించిన ఫలితాలను అందివ్వలేకపోయింది. నెక్స్ట్ అప్ కమింగ్ ప్రభాస్ మూవీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైనటువంటి సలార్ టీజర్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.

Video Advertisement

క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో ఇంతవరకు ప్రభాస్‌ని చూడని మాస్ యాంగిల్ లో చూడబోతున్నాం.పృథ్వీరాజ్‌ సుకుమార్‌, శ్రుతి హాసన్‌, జగపతి బాబు తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఉదయం విడుదలైన సలార్ చిత్రం టీజర్ 1 నిమిషం 46 సెకన్ల నిడివితో ఆసక్తిగా ఉంది.

actor-tinnu-anand

విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ టీజర్ మూవీ పై అంచనాలను ఓ రేంజ్‌కు తీసుకువెళ్లింది. ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌’ అనే ఒక్క డైలాగ్ ఉపయోగించి కేజీయఫ్‌-2 ట్రైలర్‌ ద్వారా మూవీకి విపరీతమైన హైప్‌ని తెచ్చిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీ విషయంలో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు.

‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం కానీ.. జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ..’అంటూ ట్రైలర్ లో ప్రభాస్ ను ఎలివేట్ చేసిన విధానం చిత్రం పై క్రేజీ ను పెంచే విధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్ తర్వాత మరో కొత్త చర్చ వెలుగులోకి వచ్చింది.‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అని ఇందులో పేర్కొనడంతో ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి అని నటిజెన్‌లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరినప్పుడు లేదా ఎక్కువ హింసాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు శాంతి ఒప్పందం కోసం సీజ్ ఫైర్ వాడుతారు. మరి ఈ చిత్రంలో ఈ పదం ఏ సన్నివేశాన్ని ఉద్దేశించి వాడారు అనేది మూవీ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. మరోపక్క టీజర్ లో ప్రభాస్ ముఖం కూడా సరిగ్గా కనిపించలేదని ,ఒక డైలాగ్ కూడా లేదని డార్లింగ్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.


End of Article

You may also like