“టమాటా” ధరలు ఆకాశాన్నంటడం వెనుక కారణాలు ఏమిటో తెలుసా..?

“టమాటా” ధరలు ఆకాశాన్నంటడం వెనుక కారణాలు ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాటా రేట్లు మండిపోతున్నాయి. చాలా చోట్లలో ఇప్పటికే కిలో టమాటా రేటు 100 రూపాయలు దాటింది. ఇక మధ్యప్రదేశ్‌లోని రైజెన్ జిల్లాలో టమాటా ధరలు అమాంతం పెరిగాయి. కిలో టమాటా  అక్కడ 160 రూపాయలు. దాంతో స్థానిక ప్రజలు, ప్రధానంగా గృహిణులు ఆందోళన పడుతున్నారు.

Video Advertisement

ట‌మాట లేనిదే పూట గ‌డ‌వ‌నప్పటికీ ధ‌ర‌ల షాక్‌తో మహిళలలు ఈ  కూర‌గాయను ప‌క్క‌న‌ పెడుతున్నారు. మిగతా ప్రాంతాలలో కిలో టమాటా రేట్లు భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర 120 – 150 రూపాయల మధ్య ఉంది. అంతగా టమాటా ధరలు పెరగడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Tomato-Pricesటమాట ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ప్రస్తుతం కిలో టమాట ధర 100 రూపాయలకు పైన ఉంది.  దీంతో సామాన్యులు అంత రేటు పెట్టి టమాటా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా 20 – 40 రూపాయల వరకు ఉన్నాయి. హఠాత్తుగా ధరలు పెరిగిపోవడంతో ఆందోళన పడుతున్నారు. మరో వైపు టమాటా ధరలు పెరగడంతో వాటిని దొంగతనం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం టమాటాకు డిమాండ్‌ ఉండడంతో దొంగలు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. వీలైతే కూరగాయల షాపుల్లో, టమోటా పంటలను లూటీ చేస్తున్నారు.
కర్నాటకలకు చెందిన ధరణి అనే రైతు టమోటా పంట వేశాడు. ఈసారి ఎప్పటికంటే పంట బాగా పండింది. వారంలో  మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఆలోపు దొంగలు పంటనంతా దోచుకెళ్లారు. దాని విలువ రూ. 1.50 లక్షలు.  ఇంతలా టమాటా ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే, ఉష్ణోగ్ర‌త‌ల‌లు పెరగడం, రుతుప‌వ‌నాలు  ఆలస్యం కావడంతో టమాటా దిగుబ‌డులు తగ్గాయి. దాంతో ట‌మాట ధ‌ర‌లు పెరిగాయని నిపుణులు అంటున్నారు.
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల టమాటా పంటలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన వేడి వల్ల పంట దిగుబడి తగ్గింది. అందువల్ల టమాటాల సరఫరా తగ్గిపోయింది. నష్టాల వల్ల కొందరు రైతులు టమాటా సాగును  తగ్గించారు. ఉత్తర ప్రదేశ్‌, హర్యాణారాష్ట్రాల నుంచి వచ్చే టమాటా సరఫరా చాలా తగ్గిపోయింది. అందువల్ల హోల్‌సేల్‌ మార్కెట్లలో టమాటా రేట్లు పెరిగాయని చెబుతున్నారు.

Also Read: జ్యోతి మౌర్య కేసులో పెద్ద ట్విస్ట్..! ఆమె తండ్రి ఏం అన్నారంటే..?


End of Article

You may also like