జ్యోతి మౌర్య కేసులో పెద్ద ట్విస్ట్..! ఆమె తండ్రి ఏం అన్నారంటే..?

జ్యోతి మౌర్య కేసులో పెద్ద ట్విస్ట్..! ఆమె తండ్రి ఏం అన్నారంటే..?

by kavitha

Ads

ఇటీవల సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్ జ్యోతి మౌర్య సంఘటన అందరికి తెలిసిందే. తన భార్య కలను నెరవేర్చడం కోసం రేయింబవళ్ళు శ్రమించి, చదివించిన భర్తకు ఆ భార్య గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తరువాత ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

Video Advertisement

ఉత్తర ప్రదేశ్ కు చెందిన జ్యోతి మౌర్య తన భర్త అలోక్ మౌర్య ఉద్యోగం వచ్చిన తరువాత మోసం చేసిందనే వార్త వైరల్ అయ్యింది. అయితే తాజాగా జ్యోతి మౌర్య తండ్రి తన అల్లుడే మోసం చేసి తన కుమార్తె జ్యోతి మౌర్యను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని  ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె  పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్‌ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా  పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు. అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్‌లో నివసిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో దారుణం..! ఉదయం రోడ్ మీద వెళుతుండగా..?


End of Article

You may also like