హైదరాబాద్‌లో దారుణం..! ఉదయం రోడ్ మీద వెళుతుండగా..?

హైదరాబాద్‌లో దారుణం..! ఉదయం రోడ్ మీద వెళుతుండగా..?

by Mohana Priya

Ads

19 సంవత్సరాల కుర్రాడు ముగ్గురుని బలి తీసుకున్న సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్‌ మెయిన్‌ రోడ్డు పై జులై 4వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున ఈ దారుణ ఘటన సంభవించింది.

Video Advertisement

లైసెన్స్ కూడా లేని యువకుడు మితిమీరిన స్పీడుతో బండి నడుపుతూ ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు.వివరాల ప్రకారం మహమ్మద్‌ బడి ఉద్దీన్‌ ఖాద్రీ అవినాష్ కాలేజ్ విద్యార్థి. అతను ప్రస్తుతం బీబీఏ డిగ్రీ చేస్తున్నాడు.

hyderabad car incident

పోలీసులు అందించిన వివరాల ప్రకారం అనురాధ ( 48), అమే కుమార్తె మమత(25) మరియు స్నేహితురాలు మాళవిక (36) మార్నింగ్ వాక్ కి వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. మంగళవారం పొద్దున 6:11 నిమిషాల ప్రాంతంలో కన్వెన్షన్ మరియు బాంక్వెట్ హాల్ నుండి బండ్లగూడ వైపు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఈ ముగ్గురు మహిళలు సన్ సిటీ మెయిన్ రోడ్డు వద్దకు చేరుకున్నారు.

hyderabad car incident

సరిగ్గా అదే సమయానికి మితిమించిన వేగంతో వెనుక నుంచి దూసుకు వచ్చిన హోండా సివిక్ కార్ వాళ్ళను ఢీ కొట్టింది. కారు ఢీ కొట్టిన వెంటనే అనురాధ మరియు ఆమె కూతురు మమత అక్కడికక్కడే మరణించారు. మాళవిక తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

hyderabad car incident

సంఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్‌ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుడి పేరు బయటకు వచ్చిన క్షణం నుంచి కొందరు ఈ సంఘటనకు మతపరమైనటువంటి రంగును పులిమి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

hyderabad car incident

నార్సింగి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) వి శివ కుమార్ మాట్లాడుతూ మహమ్మద్ మరియు అతని ముగ్గురు స్నేహితులు అతని పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ కానీ బయటికి వచ్చారని. అధిక వేగంతో డ్రైవింగ్ చేసిన కారు అదుపు తప్పడం వల్ల బ్రేక్ ఫెయిల్ అయి వాకింగ్ చేస్తున్న మహిళలను ఢీ కొట్టిందని తెలియపరిచారు. సంఘటన జరిగిన వెంటనే ఆ నలుగురు అక్కడ నుంచి పారిపోయారు అని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి నటిజన్స్ జస్టిస్ అడుగుతున్నారు.

ALSO READ : ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చి… సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్స్..!


End of Article

You may also like