జై భీమ్ రియల్ లైఫ్ మహిళ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఆమె పరిస్థితి ఎలా ఉంది..?

జై భీమ్ రియల్ లైఫ్ మహిళ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఆమె పరిస్థితి ఎలా ఉంది..?

by Harika

Ads

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాల్లో ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమా కూడా ఒకటి. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. సూర్య ఈ సినిమాని నిర్మించారు. అంతే కాకుండా, ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కూడా నటించారు. లిజోమోల్ జోస్, మణికందన్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు నటించారు. సూర్య ఒక లాయర్ పాత్రలో ఇందులో నటించారు. అయితే, ఈ సినిమాలో లిజోమోల్ జోస్, సెంగెని రాజకన్ను పాత్రలో నటించారు. నిజజీవితంలో సెంగెని రాజకన్ను ఇప్పటికి వృద్ధురాలు అయ్యారు.

Video Advertisement

jai bhim real life woman situation

ఆమె నిజం పేరు పార్వతి. సినిమా తర్వాత ఆమె జీవితంలో మార్పులు వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ పార్వతి ఇటీవల మాట్లాడుతూ సినిమా తర్వాత తమ జీవితంలో అలాంటి మార్పులు ఏవి రాలేదు అని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. పార్వతికి ఇప్పటికి కూడా తన సమస్యలకి పరిష్కారం దొరకలేదు. తమిళనాడు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు 4 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. 4 లక్షలు అయినా కూడా తన చేతికి కేవలం లక్ష పది వేల రూపాయలు వచ్చాయి అని పార్వతి చెప్పారు. తన జీవితానికి లక్ష పది వేల రూపాయల విలువ మాత్రమే ఉందా అని అన్నారు.

sinatalli 3

ఈ విషయం మీద పార్వతి ఐ తమిళ్ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. ఈ విషయంపై పార్వతి మాట్లాడుతూ, “కేసు నడుస్తున్నప్పుడు మమ్మల్ని ఈ కేసు వెనక్కి తీసుకోవాలి అని చెప్పారు. చాలా సమస్యలు తీసుకొచ్చారు. కానీ కమ్యూనిస్టు పార్టీ నాకు సహాయం చేసింది. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళందరూ కూలి పనులు చేసుకుంటున్నారు. నా ఇద్దరు కొడుకులకి ఎనిమిది మంది పిల్లలు. కూతురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జై భీమ్ సినిమా తర్వాత నా గురించి అందరికీ తెలిసింది. సూర్య సార్ 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది డిపాజిట్ ఫండ్.”

“దాని నుండి నెలకి నాలుగు నుండి ఐదు వేల రూపాయలు వస్తాయి. ఆ డబ్బులని నా మనవళ్ళకి ఇస్తున్నాను. రాఘవ లారెన్స్ సార్ లక్ష రూపాయలు ఇచ్చారు. కానీ నాకు సొంత ఇల్లు లేదు. ఒక చింత చెట్టు కింద మేము బతుకుతున్నాం. నా కొడుకులకి కూడా ఇల్లు లేదు. అందుకే మాకు న్యాయం కావాలి అని నా కొడుకులు కోర్టులో దావా వేశారు. తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి, న్యాయం చేయాలి” అంటూ మాట్లాడారు. పార్వతి పరిస్థితిని చూసి అందరూ చలించిపోతున్నారు. ఈ ఇంటర్వ్యూని యూట్యూబ్ లో షేర్ చేశారు.

watch video :

ALSO READ : వంట సలహాలకి భార్య కోపంగా అన్న ఈ మాటలకి… ఈ భర్త ఇచ్చిన కౌంటర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like