వంట సలహాలకి భార్య కోపంగా అన్న ఈ మాటలకి… ఈ భర్త ఇచ్చిన కౌంటర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం అన్నారంటే..?

వంట సలహాలకి భార్య కోపంగా అన్న ఈ మాటలకి… ఈ భర్త ఇచ్చిన కౌంటర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో చాలా రకాల జోక్స్ వస్తూ ఉంటాయి. కానీ కొన్ని జోక్స్ మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. అందులో, భార్య భర్తల మీద జోక్స్ ఒకటి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొన్ని విషయాలు సున్నితమైన అంశాల మీద ఉంటాయి. అలాంటివి పెద్దగా ఎవరూ ప్రోత్సహించరు. కొన్ని జోక్స్ మాత్రం సాధారణంగానే ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉన్న కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. జోక్స్ అంటే ప్రత్యేకంగా దాని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారి జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని పొరపాట్ల వల్ల ఇలాంటి జోక్స్ వస్తూ ఉంటాయి.

Video Advertisement

ఇప్పుడు అలాంటిదే ఒక జోక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఒక భార్య ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. చాలా సీరియస్ గా తన పని తను చేసుకుంటున్న భార్య దగ్గరికి భర్త వస్తాడు. భార్య వండుతున్న వంటకాన్ని పరిశీలించి చూస్తాడు. భార్య కూడా అతని వైపు చూసి ఇలా చూస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు భర్త, “ఏం చేస్తున్నావ్?” అని అడుగుతాడు. అందుకు భార్య, “కిచెన్ లో ఏం చేస్తారు? వంట చేస్తారు” అని చెప్తుంది. అప్పుడు భర్త, “కాస్త ఉప్పు ఎక్కువగా వెయ్యి. మరి అంత ఉడికించకు. ఎక్కువ మాడకుండా చూడు. మరి అంత కారం ఎందుకు” అంటూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

husband and wife joke telugu

భార్య కాస్త ఆశ్చర్యంగా చూస్తుంది. అలాగే చెప్తూ ఉంటే మధ్యలో ఆపి, “వంట ఎలా చేయాలో నాకు తెలియదా? నువ్వు సలహాలు ఇస్తావ్ ఏంటి?” అని గట్టిగానే అడుగుతుంది. భర్త అయినా కూడా ఆపకుండా ఏదో చెప్తూనే ఉంటాడు. దాంతో భార్య గట్టిగా, “నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. నీ సలహాలు నాకు అవసరం లేదు” అని చెప్తుంది. అందుకు భర్త, “కదా? నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తూ ఉంటే నాకు కూడా ఇలాగే కాలుతుంది. డ్రైవింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా అన్ని సలహాలు ఇవ్వకుండా మాట్లాడకుండా కూర్చో” అని చెప్తాడు. ఇప్పుడు భార్య ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

ALSO READ : శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు..! మహాకవి అని అందుకే అంటారు ఏమో..!


End of Article

You may also like