డైరెక్టర్ “క్రిష్ జాగర్లమూడి” తో పాటు… “హరి హర వీరమల్లు” సినిమా నుండి తప్పుకున్న సభ్యులు..!

డైరెక్టర్ “క్రిష్ జాగర్లమూడి” తో పాటు… “హరి హర వీరమల్లు” సినిమా నుండి తప్పుకున్న సభ్యులు..!

by Mohana Priya

Ads

సాధారణంగా ఒక సినిమా మొదలైన తర్వాత చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ సినిమా నుండి ముఖ్య సభ్యులు మాత్రం సినిమా నుండి వెళ్లరు. సినిమా పూర్తయ్యేంతవరకు వాళ్లు సినిమాతోనే ఉంటారు. సినిమాతో ట్రావెల్ చేస్తారు. కానీ అలాంటిది, హరి హర వీరమల్లు సినిమా నుండి చాలా మంది తప్పుకున్నారు. అందుకు డేట్స్ కారణమని అంటున్నారు. అలా హరి హర వీరమల్లు సినిమా నుండి తప్పుకున్న నటులు, టెక్నీషియన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

minus point in hari hara veeramallu teaser

# క్రిష్ జాగర్లమూడి. డైరెక్టర్ క్రిష్ జాగార్లమూడి తన సినిమా నుండి తప్పుకున్నారు. మణికర్ణిక సినిమాకి కూడా ఇలాగే జరిగింది. క్రిష్ సగం సినిమా దర్శకత్వం వహించిన తర్వాత, హీరోయిన్ కంగనా రనౌత్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కారణంగా సినిమా నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా నుండి కూడా క్రిష్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

key actors are dropping from hari hara veeramallu..!!

# జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

key actors are dropping from hari hara veeramallu..!!

# అర్జున్ రాంపాల్. విలన్ పాత్రకి అర్జున్ రాంపాల్ ని అనుకున్నారు. షూటింగ్ కూడా జరిగాక డేట్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

bhagavanth kesari movie review

# సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ కూడా సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన వీడియోలో, సినిమాటోగ్రాఫర్ పేరు జ్ఞానశేఖర్ పేరు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మనోజ్ పరమహంస పేరు కూడా ఉంది. దాంతో జ్ఞానశేఖర్ ఈ సినిమా నుండి తప్పుకోగా, మిగిలిన భాగాలని మనోజ్ పరమహంస షూట్ చేసినట్టు తెలుస్తోంది.

key actors are dropping from hari hara veeramallu..!!

# విజువల్ ఎఫెక్ట్స్ బృందంలో కొంత మంది యాడ్ అయ్యారు. గతంలో బెన్ లాక్, హరి హర సుతాన్ మాత్రమే ఉండగా, ఇప్పుడు వీళ్ళతో పాటు యూనిఫై మీడియా, మెటావ్ఎఫ్ఎక్స్ పేర్లు కూడా కనిపిస్తున్నాయి.

key actors are dropping from hari hara veeramallu..!!

image courtesy : Social News XYZ

# స్టంట్ కొరియోగ్రఫీలో కూడా గతంలో ఉన్న వాళ్ళతో పాటు విజయ్ మాస్టర్ పేరు యాడ్ అయ్యింది.

key actors are dropping from hari hara veeramallu..!!

అయితే, సినిమాలో ఇలాంటి మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ దర్శకుడు మారడం అనేది సినిమా మీద ఎంత ప్రభావం పడుతుందో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సరే సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలి అంటే విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో నటించిన ఈ అమ్మాయి తండ్రి ఒక పెద్ద స్టార్ కమెడియన్..! ఎవరంటే..?


End of Article

You may also like