అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో నటించిన ఈ అమ్మాయి తండ్రి ఒక పెద్ద స్టార్ కమెడియన్..! ఎవరంటే..?

అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో నటించిన ఈ అమ్మాయి తండ్రి ఒక పెద్ద స్టార్ కమెడియన్..! ఎవరంటే..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో సినీ నేపథ్యంలో ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్లు కూడా అలాగే సినీ నేపథ్యంతో అడుగు పెట్టారు. అలా ఇటీవల మరొక నటి సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతోనే ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఈ అమ్మాయి తండ్రి చాలా పెద్ద స్టార్ కమెడియన్. భారతదేశంలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు వాళ్ళ సత్తాని బాలీవుడ్ లో చాటిన అతి కొద్ది మందిలో మొదటిగా చెప్పుకునేది ఈయన గురించే. ఈ అమ్మాయి పేరు జెమీ లివర్. ఈ అమ్మాయి తండ్రి ఎవరో ఈపాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ప్రముఖ కమెడియన్ జానీ లివర్ కూతురు ఈ అమ్మాయి.

Video Advertisement

allari naresh aa okkati adakku heroine jamie lever

జానీ లివర్ తెలుగువారు. కానీ బాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు రావడంతో అక్కడ సినిమాలు చేస్తూ వచ్చారు. జానీ లివర్ ఇంట్లో తెలుగు మాట్లాడతారు. అలా వాళ్ల పిల్లలకు కూడా తెలుగు వచ్చింది. జానీ లివర్ కూతురు జెమీ లివర్ ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. ట్రైలర్ లో హీరో నరేష్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తో పాటు, జెమీ లివర్ కూడా కనిపిస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్స్ లో తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అప్పుడే తన ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు అని చెప్పారు.

allari naresh aa okkati adakku heroine jamie lever

హిందీలో కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్ లో నటించారు. అప్పుడే ఆ ఒక్కటి అడక్కు సినిమా బృందం చూసి జెమీ లివర్ ని తెలుగులోకి రావడానికి ఆఫర్ ఇచ్చారు. అప్పటి కూడా జానీ లివర్ తన తండ్రి అని సినిమా బృందానికి తెలియదట. తర్వాత తెలియటంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పారు. తనకి తెలుగు కూడా రావడంతో సినిమా బృందానికి తెలిసి వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోయారు అని జెమీ లివర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలా ఈ సినిమాతో జెమీ లివర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ALSO READ : తెలుగు సినిమా… తమిళ సినిమా..? రెండిట్లో ఏది ముందు పుట్టిందో తెలుసా..?


End of Article

You may also like