ప్రపంచంలో రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా..? ఎంత సంపాదించాడు అంటే..?

ప్రపంచంలో రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా..? ఎంత సంపాదించాడు అంటే..?

by kavitha

Ads

ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? భారత దేశంలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? సినిమా స్టార్లలో ఎక్కువ సంపాదించేది ఎవరు? క్రికెటర్లలో రిచెస్ట్ క్రికెటర్ ఎవరు? ఇటువంటి ప్రశ్నలను మనం తరచూ వింటూ ఉంటాం. వాటికి సమాధానం కూడా తెలిసే అవకాశం ఉంటుంది.

Video Advertisement

మరి వరల్డ్ లో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఎవరో? ఎక్కడ ఉంటారో? ఎంత సంపాదించాడో తెలుసా? కోట్లు సంపాదించినా కూడా ఇంకా బిక్షాటన చేస్తున్న అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
bharat-jain-the-worlds-richest-beggar2సాధారణంగా గుళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు వంటి ప్రదేశాల్లో భిక్షాటన చేసేవారు ప్రతిరోజూ కనిపిస్తూ ఉంటారు. సరైన తిండి, బట్టలు లేనివారిని చూడగానే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఎవరికి తోచినంత వారు ఎంతో కొంత దానం చేస్తుంటారు. కటిక పేదరికంలో ఉన్నవారే అలా మారతారు. తమ పొట్ట నింపు కోవడం కోసం బిచ్చ మెత్తుకుంటూ బ్రతుకుతుంటారని అందరికి తెలుసు. అయితే అలా వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడు అయినవారు ఉన్నారంటే ఆశ్చర్య పోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడు.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలో జీవిస్తున్న భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. భరత్ జైన్ ముంబైలో నివసిస్తాడు. అతనికి  రూ. 1.4 కోట్ల ఖరీదు అయిన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన డబ్బును షాపుల్లో పెట్టుబడిగా పెట్టాడు. థానేలో 2 షాపులను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా అతనికి  నెలకు 30వేల రూపాయల రెంట్ వస్తుంది. ఇక భారత్ జైన్ ఆస్తి విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజాగా లెక్కల ప్రకారం భరత్ జైన్  నెలవారీ ఆదాయం సుమారు లక్ష రూపాయలు.
2014 సంవత్సరం నాటికి భరత్ జైన్ భిక్షాటన ద్వారా ప్రతిరోజూ రూ. 2000 – 2500, నెలకు 75వేలు సంపాదించేవాడట. ఆర్థిక ఇబ్బందుల వల్ల భరత్ జైన్ చదువును కొనసాగించలేకపోయాడు. అతనికి పెళ్ళై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. భరత్ జైన్, అతని ఫ్యామిలీ పరేల్‌లో 1 BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివసిస్తున్నారు. తన ఫ్యామిలీలో మిగతావారు స్టేషనరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇంట్లోవారు భిక్షాటన వదులుకోమని ఎంత చెప్పినా, భరత్ జైన్ వినకుండా అదే పనిని చేస్తున్నాడు.

Also Read: హైదరాబాద్‌లో దారుణం..! ఉదయం రోడ్ మీద వెళుతుండగా..?


End of Article

You may also like