Ads
యంగ్ హీరో శ్రీ విష్ణు మరియు రెబా మౌనిక జాన్ జంటగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం సామజవరగమన. ఎటువంటి హడావిడి లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులు నెలకొల్పుతోంది ఈ చిత్రం.
Video Advertisement
విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మీడియాతో నిర్మాత అనిల్ సుంకర తన అనుభూతిని పంచుకున్నారు.
సామజవరగమన సినిమా ప్రీవ్యూ వేయడానికి ముందు రోజు చాలా టెన్షన్ కి గురి అయ్యారని అని తెలిపారు. కానీ ప్రీమియర్ తర్వాత చిత్రంపై కాస్త కాన్ఫిడెన్స్ వచ్చిందట. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి పూర్తిగా రిలీఫ్ అయ్యారట. ఈ మూవీ అనూహ్యమైన విజయాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. ఇప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న తమ బ్యానర్లో ఇటువంటి విజయం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అనిల్ సుంకర తెలిపారు.
ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి మొదట్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. కానీ ఇటీవల గత కొద్ది కాలంగా పరిస్థితుల్లో అనుగుణంగా లేకపోవడం వల్ల వరుస ప్లాపులతో సతమతమవుతున్నాము సామజవరగమన సినిమా స్టోరీనీ హీరో సందీప్ కిషన్ అనిల్ వద్దకు పంపారట. చిన్న సినిమాలు చేయనని అనిల్ అనడంతో, కథ వినండి తప్పకుండా చేస్తారు అని ఏకంగా డైరెక్టర్ ని అనిల్ వద్దకు సందీప్ పంపించారు. ఒకటిన్నర గంట కథ డిస్కస్ చేసిన తర్వాత వెంటనే అని మూవీ చేయడానికి ఓకే చెప్పారట.
అయితే ఈ మూవీలో హీరోగా నాచురల్ స్టార్ నాని లేక శర్వానంద్ అయితే బాగుంటుంది అన్న కామెంట్స్ విన్నాం.. కానీ ఈ మూవీకి హీరోగా శ్రీ విష్ణు సరిపోతాడని నేను నమ్మాను అని అనిల్ అన్నారు. ఒకవేళ శ్రీ విష్ణు ప్లేస్ లో నాని లేక శర్వానంద్ చేసి ఉన్న సినిమా ఇలాగే ఉండేది కాకపోతే కలెక్షన్స్ కాస్త పెరిగేవి అంతే తేడా… శ్రీ విష్ణు ఈ సినిమాలో చాలా బాగా చేశారు అని అన్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తే ఓ సినిమాకి 200 కోట్లు వస్తాయి అదే చిరంజీవి గారితో చేస్తే కలెక్షన్స్ వేరే రేంజ్ లో ఉంటాయి. అంతేకానీ సక్సెస్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అనిల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
End of Article