“రంగబలి” బడ్జెట్ ఎంత..? రాబట్టాల్సింది ఎంత..?

“రంగబలి” బడ్జెట్ ఎంత..? రాబట్టాల్సింది ఎంత..?

by Mohana Priya

Ads

కథ కొద్ది కాలంగా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో నాగశౌర్య. రంగబలి మూవీతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున ఈ శుక్రవారం నాగశౌర్య వచ్చాడు. ఈ చిత్రంపై అతని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మూవీ ప్రమోషన్ లో భాగంగా సత్యతో అతను చేసిన కామెడీ ఇంటర్వ్యూ బాగా వైరల్ అవ్వడంతో ప్రస్తుతం మూవీపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.

Video Advertisement

ఈ సినిమా మొత్తానికి నైజాం వరకు 120 థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరోపక్క ఆంధ్రాలో ఒక 150 థియేటర్లు అలాగే సీడెడ్ లో మరో 45 థియేటర్ల వరకు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం 550 థియేటర్ల వరకు రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి పోటీగా మరో పెద్ద చిత్రం ఏదీ లేకపోవడంతో సినిమా హాల్లో విషయంలో ఎటువంటి సమస్య తలెత్తలేదు.

rangabali movie review

శుక్రవారం విడుదల కాబోతోంది కాబట్టి వీకెండ్ ని ఈ చిత్రం బాగా గ్రాస్ చేసుకోగలిగితే కలెక్షన్స్ పరంగా కూడా ప్రాఫిట్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ బిజినెస్ వాల్యూ 4.5 కోట్లు దాకా ఉంటుందని అంచనా. మరోపక్క వరల్డ్ వైడ్ ఈ చిత్రం 5.50 కోట్లు వాల్యూ బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే మాత్రం కనీసం 6 కోట్లన్న దాటితే మూవీ క్లీన్ హిట్ అని చెప్పవచ్చు.

rangabali movie review

డిఫరెంట్ ట్రైలర్ తో వినూత్నమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అని చెప్పవచ్చు. అయితే మూవీ కూడా ప్రేక్షకుల్ని అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ వస్తుంది.

ALSO READ : డబ్బింగ్ కి ముందు “ఇంద్ర” లోని ఈ సీన్ చూసారా..? ఎమోషన్ మొత్తం మారిపోయింది..!


End of Article

You may also like