Ads
‘బాహుబలి ’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ‘ప్రభాస్’ రీసెంట్ గా ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి వారం భారీ కలెక్షన్స్ సాధించింది. కానీ మూవీ పై వచ్చిన విమర్శలు, వివాదాలు వసూళ్ల పై ప్రభావం చూపింది. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్’ టీజర్‌లో ప్రభాస్ పాత్రను ‘ది మోస్ట్ వయొలెన్స్ మ్యాన్’ గా మేకర్స్ పరిచయం చేశారు.
Video Advertisement
అయితే సలార్ టీజర్ ను ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లౌడ్ సౌండ్‌తో ఉన్న నాన్సెన్స్ యాక్షన్ అని పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా హీరో ప్రభాస్ పేరు చెప్పకుండా ఆయన నటన పై ట్వీట్ చేశాడు. దాంతో ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘సలార్’. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ తో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ టీజర్ పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు అగ్నిహోత్రి తన ట్వీట్‌లో ‘ఎవరు హింసాత్మకంగా పుట్టరు. పిల్లల మనసులను శాంతి వైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ సెలెబ్రెటీలు, ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు. ఇటువంటి హింసాత్మక లోకంలో సృజనాత్మక స్పృహ ఒకటే పరిష్కారం’ అని తెలిపారు.
ఆ ట్వీట్ కి కొనసాగింపుగా, ‘ప్రస్తుతం చిత్రాలలో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అలాగే అర్థంలేని చిత్రాలను ప్రమోట్ చేయడాన్ని ప్రతిభగా పరిగణిస్తున్నారు. అసలు యాక్టర్ కాని వ్యక్తిని అతి పెద్ద స్టార్‌గా ప్రమోట్ చేయడం అనేది అతిపెద్ద ప్రతిభగా గుర్తిస్తున్నారు. ఇక ఆడియెన్స్ కి ఏమి తెలియదని అనుకోవడం అన్నింటికంటే బిగ్గెస్ట్ టాలెంట్ అని అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
Also Read: సలార్, KGF, డీజే..! ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
End of Article