బజ్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద సాఫీగా సాగుతున్న నిఖిల్ స్పై..!

బజ్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద సాఫీగా సాగుతున్న నిఖిల్ స్పై..!

by Mohana Priya

Ads

కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా భారీ విజయం సాధిస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ గా నిలిచిన చిత్రం కార్తికేయ 2. ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన ఈ మూవీతో యంగ్ హీరో నిఖిల్ కు బాగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ స్పై ఓపెనింగ్స్ పరంగా ఇరగదీసింది. ప్రస్తుతం మార్కెట్లో అడ్డుగా మరే పెద్ద మూవీ లేకపోవడంతో రెండో వారం కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Video Advertisement

మధ్యలో రిలీజ్ అయిన కొత్త సినిమాల కారణంగా కొన్ని థియేటర్లలో ఈ సినిమాని తీసేసిన మొత్తం మీద 9 వ రోజు నుంచి 11వ రోజు వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 10 లక్షల పైగా షేర్‌ను సొంతం చేసుకోవడమే కాక వరల్డ్ వైడ్ గా 12 లక్షల వరకు షేర్‌ని తన ఖాతాలో వేసుకుంది.రెండవ వారం వచ్చేసరికి చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ చేసినప్పటికీ మొత్తం మీద కలెక్షన్స్ మాత్రం ఈ చిత్రానికి తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నాయి.

spy

16.50 కోట్లు రేంజ్ బ్రేక్ ఈవెన్ అందుకోవాల్సిన ఈ చిత్రం ఇప్పటికే 10 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. అంటే ఇంకా బ్రేక్ ఈ వెనక్కి కేవలం 5.76 కోట్లు వసూలు చేస్తే సరిపోతుంది. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుమరుగైన ఇన్సిడెంట్ ఆధారంగా నిర్మించిన ఈ స్పై చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే రాబోయే రెండు మూడు వారాల్లో విడుదలకు మరిన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.

spy movie review

దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల పై పోరాడుతున్న చేయి అన్నయ్య సుభాష్ ఓ రా ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఒక ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన అతని అన్నయ్య మరణం వెనుక మిస్టరీని సాల్వ్ చేసే ప్రయత్నం హీరో మొదలుపెడతాడు. ఇక అక్కడి నుంచి మొదలైన చిత్రం మెల్లిగా పలు రకాల ట్విస్టులతో సాగుతుంది. రా ఏజెంట్‌గా నిఖిల్ అద్భుతమైన నటనను కనబరిచాడు.


End of Article

You may also like