Ads
వినోదయ సిత్తం, ఈ పేరు కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ తమిళ బ్లాక్‌బస్టర్ సినిమాని ‘బ్రో’ అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో విడుదల కాబోతుంది.
Video Advertisement
వినోదయ సిత్తం తమిళ మూవీకి దర్శకత్వం వహించిన సముద్రఖని బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీలో కీలక పాత్రలో సముద్రఖని నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ ప్రస్తుతం ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఆ సినిమా కథ ఏమిటో? తెలుగులో ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..
వినోదయ సిత్తం తమిళ మూవీలో ప్రధాన పాత్రలో తంబిరాయమ్య నటించారు. కీలక పాత్రలో సముద్రఖని నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పరశురామ్ (తంబిరామయ్య) ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా 25 సంవత్సరాలుగా పనిచేస్తుంటాడు. అతను టైమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అన్ని విషయాలను టైమ్ ప్రకారం చేస్తుంటాడు. భార్య, ఇద్దరు కూతుర్లు పరశురామ్ మాటను జవదాటరు. అతని కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.పరశురామ్ ఒకరోజు పని మీద వెళ్ళి వస్తుండగా అతనికి యాక్సిడెంట్ అయ్యి, మరణిస్తాడు. అప్పుడు అతన్నిస్వర్గానికి తీసుకెళ్లడం కోసం టైమ్ (సముద్రఖని) వస్తాడు. కానీ పరశురామ్ తన ఫ్యామిలీ బాధ్యతల్ని తీర్చడం కోసం మళ్ళీ బతికించమని టైమ్‌ను వేడుకుంటాడు. దాంతో టైమ్ అతనికి 3 నెలలు టైమ్ ఇచ్చి, అప్పటిదాకా తనతోనే ఉంటానని చెప్తాడు. ఇక పరశురామ్ 3 నెలల్లో తన బాధ్యతల్ని నెరవేర్చాడా? లేదా? అన్నదే మిగతా కథ.ఇక ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని పాత్రని పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని టాక్. ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీలో తంబిరాయమ్యకు ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉంటారు. అంటే తెలుగు రీమేక్ లో కథలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది.
Also Read: ఆ హీరోతో మాత్రం సినిమా వద్దు అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.! అసలేమైంది?
End of Article