Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ క్రేజీ కాంబో లో వస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ ను దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
Video Advertisement
ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించే భాధ్యత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్వహిస్తున్నారు.ఈ మూవీ లో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతికాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తమిళ్ లో సూపర్ హిట్ ఆయిన వినోదయ సీతం అనే మూవీకి రీమేక్ గా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా జీ స్టూడియోస్‌తో కలిసి నటిస్తున్న ఈ మూవీ జూలై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో మూవీ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసారు.
అయితే ఈ మూవీకు సంబంధించిన ఒక హాట్ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రివ్రమైన చర్చ జరుగుతుంది. తమిళ్లో ఈ మూవీ డైరెక్టర్ అయిన సముద్రఖనికి తెలుగులో కూడా బ్రో మూవీ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ….మెయిన్ రోల్ త్రివిక్రమ్‌దే అని టాక్.
ఈ మూవీ కోసం స్క్రిప్ట్ ఇవ్వడంతో పాటు, పవన్ కు సెట్ అయ్యే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశాడు అని తెలుస్తుంది. ఇక స్క్రీన్ ప్లే తో పాటు మాటలు కూడా త్రివిక్రమ్ సమకూరుస్తున్నారు. దాంతో ఈ మూవీ కోసం అతను ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ పుచుకుంటునట్లు ప్రచారం జరుగుతోంది.ఇది ప్రస్తుతం చాలా మంది కుర హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు….
ALSO READ : “అప్పుడు ఇబ్బంది అనిపించిన విషయం… ఇప్పుడు గుర్తు రాలేదా..?” అంటూ… “సమంత” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
End of Article