“బిగ్ బాస్ 7” రూల్స్.. అలా చేస్తే హౌస్ నుండి అవుట్..!

“బిగ్ బాస్ 7” రూల్స్.. అలా చేస్తే హౌస్ నుండి అవుట్..!

by kavitha

Ads

బుల్లితెర పై ప్రభంజనం సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్. త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  బిగ్ బాస్ సీజన్‌ 1 నుండి తెలుగు రాష్ట్రాలలో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

Video Advertisement

బిగ్ బాస్ సీజన్‌ 7 కొత్త థీమ్‌తో లాంచ్‌కు సిద్ధం అవుతోంది. ఇటీవల సీజన్‌ 7 లోగో అధికారికంగా విడుదల అయ్యింది. అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్‌ 7 ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్‌ రూల్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో 6వ సీజన్ తప్ప మిగిలిన సీజన్స్ అన్ని రికార్డ్ స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ ని పొంది సూపర్ హిట్ అయ్యాయి. అతి త్వరలోనే  7వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా హోస్ట్ హీరో అక్కినేని నాగార్జునే అని తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ ప్రోమోని త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నారట. ఇక సీజన్‌ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన రూల్స్ ఉండబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్స్  కొన్ని సందర్భాలలో హద్దులు దాటి మరి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నోటి నుండి పొరపాటున బ్యాడ్ వర్డ్ ఒక్కటి బయటికి వచ్చినా సరే ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి షో నుండి బయటకి పంపేస్తారట.
అది మాత్రమే కాకుండా బిగ్ బాస్ 5వ సీజన్ లో షణ్ముఖ్, సిరల రొమాన్స్ బిగ్ బాస్ షో చూసే ఆడియెన్స్ కు ఎంత ఇబ్బంది కలిగించిందో తెలిసిందే. ఇక ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. అందువల్ల సీజన్‌ 7లో అలాంటి రొమాన్స్ జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. హద్దులు దాటి రొమాన్స్ చేసిన వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది.

Also Read: MAHAVEERUDU REVIEW : “శివకార్తికేయన్” హీరోగా, రవితేజ వాయిస్ ఓవర్ తో వచ్చిన మహావీరుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 

 


End of Article

You may also like