Ads
ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ తదితర భాషల చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు ఆడియెన్స్ కోసం ఓటీటీ సంస్థలు డబ్బింగ్ చేసి మరీ ఈ చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
Video Advertisement
అలా కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఒక విభిన్న కథతో తెరకెక్కిన చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే ‘తందట్టి’, ద స్టోరీ ఆఫ్ గోల్డ్ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయ్యింది. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ కథ ఏమిటి? సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
రామ్ సంగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘తందట్టి’ సినిమాలో రోహిణి, పశుపతి రామస్వామి, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తమిళ మూవీ థియేటర్లలో జూన్ 23న రిలీజ్ అయ్యింది. తందట్టి తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ కథ విషయనికి వస్తే, వీరసుబ్రమణియన్ (పశుపతి) పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. 10 రోజుల్లో అతని రిటైర్మెంట్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కిడారిపట్టి అనే గ్రామంలోని తంగపొన్ను(రోహిణి) అనే వృద్ధురాలు కనిపించకుండా పోతుంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. ఆమెను వెతికే పనిని వీర సుబ్రమణియన్‌కు అప్పగిస్తారు. అతను తంగపొన్ను కనిపెట్టాడా? ఆమె ఏం అయ్యారు? ఆమెను వెతికే క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.
ఆస్తులు బంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ మూవీలో చక్కగా చూపించారు. ఒక వైపు నవ్విస్తూనే, దర్శకుడు సమాజానికి చురకలు అంటించాడు. ఊరిలోని సంబంధాలు, స్వార్థపూరితమైన మనసులు, ఆస్తి కోసం కన్నవారి పై పిల్లల కపట ప్రేమను అర్థమయ్యేలా చక్కగా మలిచాడు. ఆడియెన్స్ కథతో కనెక్ట్ అవుతారు. కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలలా అనిపిస్తాయి. రోహిణి, పశుపతి తమ క్యారెక్టర్ల లో జీవించారు. మిగతా నటీనటులు ఎవరి పాత్రలకు తగిన విధంగా వారు నటించారు.
Also Read: “బేబీ” మూవీలో “హీరోయిన్ ఫ్రెండ్” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article